https://oktelugu.com/

Varun Tej : హారర్ కామెడీ ని నమ్ముకున్న మెగా హీరో వరుణ్ తేజ్..కనీసం ఈసారైనా అదృష్టం వరిస్తుందా?

మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతీ హీరో మంచిగానే సక్సెస్ అయ్యారు. మూడవ తరం హీరోలు కూడా ఒకానొక సమయంలో వరుసగా సూపర్ హిట్స్ ని ఇస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నారు.

Written By: , Updated On : January 30, 2025 / 08:26 AM IST
Varun Tej

Varun Tej

Follow us on

Varun Tej : మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతీ హీరో మంచిగానే సక్సెస్ అయ్యారు. మూడవ తరం హీరోలు కూడా ఒకానొక సమయంలో వరుసగా సూపర్ హిట్స్ ని ఇస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి హీరోలలో ఒకరు వరుణ్ తేజ్. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందు ఈయన మీద అభిమానుల్లో అంచనాలు భారీగా ఉండేవి. ఎందుకంటే మూడవ తరం హీరోలలో అందరికంటే అందంగా ఉంటాడు, మంచి కటౌట్ అనే అభిప్రాయం ఉండేది. మొదటి సినిమా ‘ముకుంద’ ఫ్లాప్ అయ్యింది. రెండవ సినిమా, మూడవ సినిమా కూడా అంతంత మాత్రం గానే ఆడింది. కానీ నాల్గవ చిత్రం ‘ఫిదా’ మాత్రం ఆయన కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. ఇక వరుణ్ తేజ్ కి తిరుగేలేదు అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత విడుదలైన ‘తొలిప్రేమ’, ‘గద్దల కొండ గణేష్’ వంటి చిత్రాలు కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి.

కానీ ఆ తర్వాత సోలో హీరోగా హిట్స్ ని అందుకోలేకపోయాడు. కానీ తన ప్రతీ చిత్రంతో ఎదో కొత్త ప్రయోగం చేస్తున్నాడు, పర్వాలేదు అనే రేంజ్ ఇమేజ్ ని అయితే దక్కించుకున్నాడు. వెంకటేష్ తో కలిసి ఆయన నటించిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ ౩’ వంటి చిత్రాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ ‘గడ్డలకొండ గణేష్’ తర్వాత ఆయన సోలో హీరో గా నటించిన అంతరిక్షం, గని, గాండీవ దారి అర్జున, ఒపేరేషన్ వాలెంటైన్, మట్కా వంటి చిత్రాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఎలాంటి ఫ్లాప్స్ అంటే మళ్ళీ కోలుకోవడం కూడా చాలా కష్టమే. ఇప్పుడు ఆయన ఆశలన్నీ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఇండో – కొరియన్ కామెడీ హారర్ చిత్రం పైనే ఉన్నాయి.

ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ అసోసియేషన్స్, యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోబోతుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం హారర్ కామెడీ జానర్ కి మంచి క్రేజ్ ఉండడంతో, ఈ సినిమాని కూడా ఆ జానర్ లో ఎంచుకున్నారు. కానీ ఇండియన్, కొరియా బ్యాక్ డ్రాప్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి ఉన్న పెద్ద పాజిటివ్ ఏమిటంటే తమన్ సంగీతం అందించబోతుండడమే. హీరోయిన్ ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. శ్రీలీల డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీల కి ప్రస్తుతం యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె క్రేజ్ ఈ సినిమాపై హైప్ పెంచేందుకు ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నారు మేకర్స్. మరి ఈ చిత్రం వరుణ్ తేజ్ కి కం బ్యాక్ అయ్యే విధంగా ఉంటుందా లేదా అనేది చూడాలి.