Keerthy Suresh
Keerthy Suresh : పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘నేను శైలజ’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ మలయాళం కుట్టి, ఆ సినిమాతోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న కీర్తి సురేష్, ‘మహానటి’ చిత్రం తో తన అద్భుతమైన నటనతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసింది. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, కీర్తి సురేష్ కి ఉత్తమనటి క్యాటగిరీలో నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ ఈమె మాత్రమే.
ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో కీర్తి సురేష్ రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అభిమానులతో అప్పుడప్పుడు ఈమె ఇంటరాక్ట్ కూడా అవుతూ ఉంటుంది. అయితే ట్విట్టర్ లో అజయ్ అనే ఒక అభిమాని ఈమె రిప్లై కోసం 211 రోజులు పెద్ద యుద్ధమే చేసాడు. తనకి కీర్తి సురేష్ ఎట్టి పరిస్థితిలోను రిప్లై ఇవ్వాల్సిందేనని, లేకపోతే నేను అన్నం కూడా తినను అంటూ 211 రోజుల నుండి ట్విట్టర్ లో ఆమెని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ వేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు 212వ రోజు ఆమె అజయ్ కి రిప్లై ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నన్ను క్షమించు అజయ్..నీ ట్వీట్స్ ని ఇప్పుడే నేను చూస్తున్నాను. నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞురాలిని’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
అయితే అజయ్ అనే వ్యక్తిపై సోషల్ మీడియా లో భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. 211 రోజులు ఒక హీరోయిన్ గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసావు, అదేదో కెరీర్ మీద ఫోకస్ పెట్టి ఉండుంటే, ఈరోజు మంచి స్థాయిలో ఉండేవాడివి కదా, రిప్లై ఇచ్చింది గా, వెళ్లి ఏదైనా పని చూసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే మొత్తానికి సాధించావ్ అంటూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ కెరీర్ విషయానికి వస్తే, అనుకున్న స్థాయిలో కొనసాగడం లేదు. ఆంటోనీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మొదటి బాలీవుడ్ చిత్రం ‘బేబీ జాన్’ విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అదే విధంగా తెలుగులో ఆమె చేసిన చివరి చిత్రం ‘భోళా శంకర్’ కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆమె తన మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది, త్వరలోనే ఆమె తన కొత్త సినిమాకి సంబంధించిన వివరాలు తెలిపే అవకాశం ఉంది.