Game Changer
Game Changer : కథలో కొత్తదనం ఉంటే, ఊరు పేరు తెలియని హీరోలకు కూడా వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తున్న రోజులివి. అలాంటిది ఒక స్టార్ హీరో మంచి సినిమా చేస్తే, అది కూడా రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కి సరైన సినిమా పడితే, బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో ఊహించగలమా?, వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అవలీలగా వచ్చేస్తుంది కదూ..అలాంటి బంగారం లాంటి అవకాశాన్ని మిస్ ‘గేమ్ చేంజర్’ చిత్రం తో మిస్ చేసాడు డైరెక్టర్ శంకర్. #RRR లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చింది. ఆయన పాత సినిమాలను జపాన్ లో విడుదల చేస్తే భారీ వసూళ్లు వచ్చాయి. నార్త్ ఇండియా లో రామ్ చరణ్ క్రేజ్ ని చూస్తే ఎవరికైనా కుళ్ళు రావాల్సిందే.
అలాంటి క్రేజ్ వచ్చిన హీరోకి కథలో ఎలాంటి దమ్ము లేని ‘గేమ్ చేంజర్’ లాంటి సినిమా పడడం దురదృష్టకరం. డైరెక్టర్ శంకర్ నుండి ఒకప్పుడు సినిమా వస్తుందంటే కచ్చితంగా ఎదో ఒక ‘వావ్’ ఫ్యాక్టర్ ఉండేది. కానీ ‘గేమ్ చేంజర్’ అలాంటివి భూతద్దం వేసి వెతికినా కనిపించదు. అభిమానులు అసలు రెండవసారి థియేటర్స్ కి వచ్చి ఎందుకు చూడాలి?, వాళ్ళని సంతృప్తి పరిచే సన్నివేశాలు అసలు ఏమున్నాయి అని గుర్తు చేసుకుంటే ఒక్కటి కూడా గుర్తుకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి అద్భుతాన్ని సృష్టించాడు డైరెక్టర్ శంకర్. మొదటి ఆట నుండే టాక్ ఘోరంగా రావడంతో కలెక్షన్స్ పై చాలా బలమైన ప్రభావం పడింది. ఓపెనింగ్స్ కూడా రామ్ చరణ్ స్థాయికి తగ్గట్టుగా లేవు. మొదటి రోజు 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత స్టామినా ఉన్న ఈ సినిమా, క్లోజింగ్ లో 200 కోట్ల రూపాయిలు రాబట్టే పరిస్థితికి వచ్చింది.
ట్రేడ్ పండితులు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 250 కోట్ల రూపాయలకు జరిగిందట. అంటే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. కానీ వచ్చింది కేవలం 110 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే. అంటే నిర్మాత దిల్ రాజు కి వంద కోట్ల రూపాయలకు పైగా నష్టం. కనీసం 50 శాతం రికవరీ ని కూడా అందుకోలేకపోయింది. దిల్ రాజు తెలివిగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపి ఉండకపోయుంటే పాపం ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చేది. సరైన సమయం లో భలే సేవ్ అయ్యాడు అంటూ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ ఇక నుండి ఇలాంటి రొటీన్ సినిమాలు ఆపేసి, వచ్చిన క్రేజ్ ని సరిగ్గా ఉపయోగించుకుంటూ తన తోటి స్టార్ హీరోలు లాగా మంచి సబ్జెక్టు ఉన్న పాన్ ఇండియన్ సినిమాలు చేయాలని కోరుకుందాం.