Vaishnav Tej: దసరా నవరాత్రులు రానే వస్తున్నాయ్. ఇంకా టీవీ చానెల్స్ యొక్క తక్షణ కర్తవ్యం ఏదొక ఈవెంట్ చేసి ప్రేక్షకులని అలరించడమే. గత కొద్ది సంవత్సరాల నుండి టీవీ ఛానల్స్ వరుస పెట్టి పోటా పోటీ గా ఒక దానిని మించి ఇంకోటి ఈవెంట్స్ చేస్తూ పండగ పూట ప్రేక్షకులని అలరింప చేస్తున్నాయి.

అసలు ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ మొదటిగా ప్రవేశపెట్టింది జీ తెలుగు. సంక్రాంతి, ఉగాది పండగలు మొదలుకుని దసరా, క్రిస్మస్ వరకు ఇదొక ఈవెంట్ చేసి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేది. కాలక్రమేణా జీ తెలుగు బాటన మిగతా టీవీ చానెల్స్ కూడా ఈవెంట్స్ చెయ్యడం మొదలు పెట్టాయి. అలా చెయ్యడం వాళ్ళ టీవీ చానెల్స్ కి మంచి క్రేజ్, టి ఆర్పి రావడం మొదలయ్యాయి. అలా పండగ రోజు ప్రతి ఒక్క టీవీ ఛానల్ ఏదొక ఈవెంట్ ని చెయ్యడం స్టార్ట్ చేశాయి.
ఈ నేపథ్యం లో దసరా పండగ స్పెషల్ గా జీ తెలుగు నిర్వహిస్తున్న ‘ దసరా దోస్తీ ‘ అనే ఈవెంట్ కి అతిధి గా విచ్చేస్తాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ మధ్య కాలం లో బాగా పాపులరైన ‘బీబమ్మ చెప్పేదైనా’ అనే డైలాగ్ ని హీరో వైష్ణవ్ తేజ్ తో శ్రీ ముఖితో రీ క్రియేట్ చేయిస్తుంది. అలా సరదాగా జరిగిన సంభాషణలో నిరూపమ్ ను విలన్ ను చేయడానికి యాంకర్ శ్రీముఖి ప్రయత్నించినా వైష్ణవ్ నో చెప్తాడు.