Ghani Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేసిన ‘గని’ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచింది. ఈ చిత్రం కనీస వసూళ్లను కూడా సాధించలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ‘గని’ సినిమాలో మ్యాటర్ లేకపోవడం.. మరోపక్క ఆర్ఆర్ఆర్ పోటీగా ఉండటంతో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.
Ghani Collections
అల్లు బాబీ ‘గని’ సినిమాకి నిర్మాత కావడంతో ఈ సినిమా పై చిన్నపాటి ఆసక్తి కలిగింది. కాకపోతే.. వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చూపించడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ‘డిజాస్టర్’ ఫిగర్స్ ను నమోదు చేసింది గని. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
Also Read: RRR Collections: ప్చ్.. లక్షలకు పడిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ !
4 డేస్ కు గానూ ‘గని’ చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..
నైజాం 1.44 కోట్లు
సీడెడ్ 0.44 కోట్లు
ఉత్తరాంధ్ర 0.63 కోట్లు
ఈస్ట్ 0.35 కోట్లు
వెస్ట్ 0.24 కోట్లు
గుంటూరు 0.32 కోట్లు
కృష్ణా 0.27 కోట్లు
నెల్లూరు 0.19.1 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఫస్ట్ వీకెండ్ కు గానూ 3.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 కోట్లు
ఓవర్సీస్ 0.35 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ కు గానూ 4.42 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
Ghani Collections
అంటే 5వ రోజు ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలు కలెక్ట్ చేసింది. ఇది చాలా దారుణం. ‘గని’ సినిమాకి రూ.25.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని బిజినెస్ లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ.27 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. కానీ నాలుగో రోజుకే సింగిల్ డిజిట్ కి పడిపోయాడు వరుణ్ తేజ్.
Also Read:RRR OTT Release Date: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ ఆ రోజే ?