Lavanya Tripathi: కులపిచ్చి సమాజంలో నాటుకుపోయింది. నాగరిక సమాజంలో కూడా కులం అనే జాడ్యం తాండవిస్తుంది. ఉద్యోగాలు, పదవులు, ప్రయోజనాలు, పేరు, కీర్తి ఒకటేంటి ప్రతిచోటా క్యాస్ట్ ఫీలింగ్ పని చేస్తుంది. ఒక కొత్త వ్యక్తిని కలవగానే ఈయనది ఏ కులం అనే ఆలోచనలో పడతారు. మన తెలుగోళ్లలో ఈ కుల పిచ్చి పాళ్ళు కొంచెం ఎక్కువే. దానికి నిదర్శనం తాజా పరిణామం. కొణిదెల వారి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి క్యాస్ట్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది.
జూన్ 9న హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఈ వేడుకకు మెగా హీరోలందరూ హాజరయ్యారు. స్టార్స్ రాకతో వరుణ్ తేజ్ నిశ్చితార్ధ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది త్వరలో లావణ్య-వరుణ్ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఈ ఏడాది చివర్లో పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పెళ్లి వేడుక జరపనున్నారట. మెగా కోడలు అవుతున్న లావణ్య త్రిపాఠి ప్రతి విషయాన్ని అభిమానులు తెలుసుకుంటున్నారు.
ముఖ్యంగా లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటని సెర్చ్ చేస్తున్నారట. గత మూడు రోజులుగా గూగుల్ లో పెద్ద ఎత్తున లావణ్య త్రిపాఠి క్యాస్ట్ తెలుసుకోవాలని సెర్చ్ చేస్తున్నారట. తెలుగింటికి వచ్చిన ఈ నార్త్ అమ్మాయి కులం గురించి ఇంత చర్చ నడవడం హాట్ టాపిక్ అవుతుంది. గూగుల్ లో లావణ్య క్యాస్ట్ తెలుసుకోవాలని సెర్చ్ చేస్తుండగా ఆమె పేరు వైరల్ అవుతుంది. కాగా లావణ్య త్రిపాఠి యూపీలో పుట్టిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. తండ్రి హైకోర్ట్ లాయర్, తల్లి రిటైర్డ్ టీచర్.
లావణ్యకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నాడు. ఓ సందర్భంలో క్యాస్ట్ పై లావణ్య తన అభిప్రాయం వెల్లడించింది. ఒక వ్యక్తికి గౌరవం కులం వలన రాదు. వారి వ్యక్తిత్వం, విజయాల ఆధారంగా గొప్పవాళ్ళు అవుతారని ఆమె అన్నారు. మా కుటుంబంలో ఎవరికీ కుల పట్టింపులు లేవని లావణ్య అన్నారు. అందుకే ఆమె ఇంటర్ క్యాస్ట్ తో పాటు ఇంటర్ స్టేట్ మ్యారేజ్ చేసుకుంది. కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ తో రిలేషన్ లో ఉన్న లావణ్య నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్ళికి సిద్ధమయ్యారు.