https://oktelugu.com/

Allu Arjun Arrested: బోరుమని విలపిస్తున్న అల్లు అరవింద్..అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టిన మెగా ఫ్యామిలీ..వైరల్ అవుతున్న నాగబాబు వీడియో

సెక్యూరిటీ కారణాల వల్ల ఆయన్ని పోలీసులు వచ్చేందుకు వీలు లేదని ఆదేశాలు ఇచ్చారు. దీంతో చిరంజీవి నేరుగా తన సతీమణి సురేఖ తో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు. కొడుకు అరెస్ట్ తో కృంగిపోయిన అల్లు అరవింద్ ని ఓదారుస్తూ, అతనికి ధైర్యం చెప్పారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 13, 2024 / 07:15 PM IST

    Allu Arjun Arrested(14)

    Follow us on

    Allu Arjun Arrested: హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో తొక్కిసిలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన విషయంలో అల్లు అర్జున్ ని భాద్యుడిని చేస్తూ తెలంగాణ పోలీసులు నేడు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తరుపున న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో బలంగా వాదించి, ఇంటెర్మ్ బెయిల్ వచ్చేలా చేసాడు. అయితే ఈ బెయిల్ కేవలం నాలుగు వారాలకు మాత్రమే వర్తిస్తుంది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి హై కోర్టుకి వెళ్లాల్సిందిగా కోర్టు తరుపున జడ్జి చెప్పుకొచ్చాడు. దీంతో ఉదయం నుండి విపరీతమైన టెన్షన్ తో ఉన్న అభిమానులు, కాస్త రిలీఫ్ పొందారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకున్న వెంటనే మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన ఇంటికి చేరుకుంది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి బయలుదేరాడు.

    కానీ సెక్యూరిటీ కారణాల వల్ల ఆయన్ని పోలీసులు వచ్చేందుకు వీలు లేదని ఆదేశాలు ఇచ్చారు. దీంతో చిరంజీవి నేరుగా తన సతీమణి సురేఖ తో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు. కొడుకు అరెస్ట్ తో కృంగిపోయిన అల్లు అరవింద్ ని ఓదారుస్తూ, అతనికి ధైర్యం చెప్పారు. కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం తరళి వచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే నేరుగా నాంపల్లి హై కోర్టు కి విచ్చేశాడు. అక్కడ పోలీసులు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ మాట వినలేదు. వాళ్ళతో చాలాసేపు వారించి, అల్లు అర్జున్ కి ధైర్యం చెప్పి వెళ్లారు. అయితే చిరంజీవి కోరిక మేరకే లాయర్ నిరంజన్ రెడ్డి క్వాష్ పిటీషన్ వేయడం, అల్లు అర్జున్ కి బెయిల్ రావడం వంటివి జరిగింది. ఈ ఒక్క సంఘటన మెగా, అల్లు కుటుంబాలు కలిసే ఉన్నాయని అభిమానులకు సందేశం వెళ్లేలా చేసింది.

    మరోపక్క అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్లడం పై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పట్లో పరోక్షంగా ట్వీట్లు వేసిన సంగతి తెలిసిందే. ఈరోజు అల్లు అర్జున్ కి కష్టం వచ్చినప్పుడు,ఆయన ఇంటికి వెళ్లిన రెండవ వ్యక్తి నాగ బాబే. రాజకీయ పరంగా ఎన్ని విబేధాలు అయినా రావొచ్చు, కానీ ఒక్కసారి కష్టం వస్తే కుటుంబం మొత్తం ఏకం అవుతుంది అనడానికి నిదర్శనం ఇదే. ఇన్ని రోజులు మెగా, అల్లు కుటుంబాల మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేసిన ప్రత్యర్థులు, వాళ్ళు ఇలా కలిసిపోవడాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతాయి. ఎన్ని సంఘటనలు ఎదురైనా మెగా, అల్లు కుటుంబాలు ఒక్కటే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ ని కలిసేందుకు విజయవాడ లో తన రాజకీయ కార్యక్రమాలను ముగించుకొని హైదరాబాద్ కి విచ్చేశాడు.