Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సోషల్ మీడియా లో అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సంధ్య థియేటర్ లో రేవతి అనే మహిళ దుర్మరణం చెందడం, దానికి అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లనే అని ఆమె భర్త పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం. పోలీసులు FIR నమోదు చేసి సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు , నేడు అల్లు అర్జున్ కి కూడా అరెస్ట్ చేయడం వంటివి వరుసగా జరిగాయి. అయితే ఈ ఘటనపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దురదృష్టకరమైన సంఘటనలో అల్లు అర్జున్ పొరపాటు ఎంత ఉందో, పోలీసుల పొరపాటు కూడా అంతే ఉంది. కానీ ఒక్కరినే నిందించి అరెస్ట్ చెయ్యడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. కాసేపటి క్రితమే మాజీ సీఎం జగన్ కూడా ఈ ఘటనపై విచారం ని వ్యక్తం చేసాడు.
ఇదంతా పక్కన పెడితే సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే మీడియా కంట పడగా, మీడియా రిపోర్టర్స్ ఆయన్ని అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్నలు అడిగారు. దానికి ఆయన సమాధానం చెప్పకుండా నవ్వుతూ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. చూస్తుంటే రేవంత్ రెడ్డి తన పేరు ని మర్చిపోయినందుకే కావాలని ఇదంతా చేసాడని, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఒక నటుడికి ఇలాంటి అవమానం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చింది. సీనియర్ మోస్ట్ లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరుపున వాదించి బెయిల్ వచ్చేలా చేసాడు. అయితే ఈ బెయిల్ కేవలం నాలుగు రోజులకా, లేదా పూర్తి స్థాయిలో ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది.
మరోపక్క దివంగత రేవతి భర్త భాస్కర్ కూడా అల్లు అర్జున్ పై తాను వేసిన కేసు ని వెనక్కి తీసుకోవడానికి సిద్దమయ్యాడు. ఇంత సీరియస్ మ్యాటర్ అవుతుందని ఊహించలేదని, మా భార్య చనిపోవడానికి అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదని, క్షణికావేశంలో పెట్టిన ఆ కేసు ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన కాసేపటి క్రితమే మీడియా కి ఒక వీడియో విడుదల చేసాడు. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు బాధితుడికి భారీ ఎత్తున డబ్బు డిమాండ్ చేసి ఉంటారని, అందుకే కేసు ని వెనక్కి తీసుకొని ఉండుంటారని అంటున్నారు. అయితే ఒక పక్క అల్లు అర్జున్ కి కేసు లో బెయిల్ దొరికింది, మరో పక్క భాస్కర్ కేసు విత్ డ్రా చేసుకున్నాడు, దీంతో ఈ కేసు క్లోజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.