Mega Family Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోల హవా కొంతవరకు తగ్గింది. గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ చేస్తున్న సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. అభిమానుల అంచనాలను అందుకోలేకపోతున్నాయి. కారణం ఏంటి అంటే వాళ్ళ స్టోరీ సెలక్షన్ లోనే చాలా వరకు తప్పులైతే జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు ఆరుగురు హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి సక్సెస్ లను సాధించడంలో కొంతవరకూ తడబడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘భోలా శంకర్’ సినిమాతో చాలా వరకు బ్యాడ్ నేమ్ ను మూటగట్టుకున్నాడు. ఇక తన ఖాతాలో ఒక భారీ డిజాస్టర్ ను కూడా నమోదు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వచ్చిన ‘ హరిహర వీరమల్లు ‘ సినిమాతో భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. ఇక రామ్ చరణ్ సైతం ‘ గేమ్ చేంజర్ ‘ సినిమాతో ఇప్పుడు భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుణ్ తేజ్ వరుసగా ‘గాండీవ దారి అర్జున’, మట్కా సినిమాలతో నిరాశపరిచాడు…సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు… ఇక వైష్ణవ్ తీజ్ పరిస్థితి కూడా అలానే ఉంది. మొత్తానికైతే మెగా ఫ్యామిలీ హీరోలందరు రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి హిట్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరమైతే ఉంది. ఒకవేళ వీళ్ళు కనక రాబోయే సినిమాలతో సత్తా చాటుకోకపోతే మాత్రం చాలా వరకు వెనుకబడిపోతారు. ఇప్పుడున్న స్టార్ హీరోలందరు ముందు వరుసలో దూసుకుపోతున్నారు.
Also Read: ‘మయసభ’ ఫుల్ సిరీస్ రివ్యూ…
మరిలాంటి హీరోలు తట్టుకొని ముందుకు వెళ్లాలంటే మెగా హీరోలు కూడా భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా రానటువంటి గొప్ప గుర్తింపును మెగా ఫ్యామిలీ హీరోలు మంచి సినిమాలతో దక్కించుకున్నారు.
కాబట్టి వాళ్ళు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది… వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పించడానికి సన్నహాలు చేస్తున్నవే కావడం విశేషం… మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నారు. వాళ్ళ అభిమానులను ఆనంద పరచడానికి గొప్ప విజయాలను అందుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారా?
Also Read: రజినీకాంత్ vs నాగార్జున… కూలీ మూవీ లో ఎవరి డామినేషన్ ఉండబోతుంది..?
లేదంటే రాబోయే సినిమాలతో ప్లాప్ లను మూటగట్టుకునే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఇక మెగా ఫ్యామిలీ సినిమాలు సక్సెస్ బాట పడితే మాత్రం వాళ్ళ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి… ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కళ్యాణ్ తోనే మెగా ఫ్యామిలీ సక్సెస్ బాట పట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన మొదలుపెట్టిన సక్సెస్ లను ఎవరు కొనసాగిస్తారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…