Allu Sirish Engagement: మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య చాలా కాలం నుండి కోల్డ్ వార్ జరుగుతుంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఈ రెండు కుటుంబాలు కలిసే సందర్భం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు వాళ్ళు ఒక్కటే, అభిమానులే లేనిపోనీ అపోహలు పెట్టుకొని సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉన్నారు అని అనుకునేవారు. రీసెంట్ గా ఉపాసన కి రెండవ సీమంతం జరిగినప్పుడు అల్లు ఫ్యామిలీ రాకపోవడం పై మీడియా లో పెద్ద చర్చ జరిగింది. సీమంతం అనేది చిన్న విషయం కాదు. ఒక ఆడపిల్ల జీవితానికి ఎంతో ముఖ్యమైన శుభకార్యం. కుటుంబం మొత్తం కలిసి చేసుకోవాల్సిన సంబరం. ఇలాంటి వేడుకకు హాజరు కాకపోతే పెద్ద చర్చనే జరుగుతుంది మరీ, అది సహజం. అయితే అల్లు అరవింద్ అమ్మ చనిపోయి రెండు నెలలు కూడా కాలేదు కాబట్టి, అల్లు కుటుంబం శుభకార్యాలు చేసుకోకూడదు, శుభకార్యాలకు హాజరు కాకూడదు అనే లాజిక్ ని తీసుకొచ్చారు.
Also Read: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ కుమ్మేసాడుగా…
అయితే నిన్న అల్లు శిరీష్ నిశ్చితార్థం ఎలా జరిగింది?, ఆ నిశ్చితార్థం కూడా వేరే ప్రదేశం లో ఏమి జరగలేదు. అల్లు అరవింద్ తల్లి చనిపోయిన ఇంట్లోనే జరిగింది. చనిపోయిన రెండు నెలలకే శుభకార్యం ఎలా చేశారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అల్లు శిరీష్ నిశ్చితార్ధ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప, కానీ ఆయన సతీమణి మాత్రం హాజరైంది. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ శుభకార్యానికి వచ్చినప్పుడు అల్లు ఫ్యామిలీ ఎందుకు రాలేదు?, అసలు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ని ఆహ్వానించిందా?, ఒకవేళ ఆహ్వానించినా కూడా అల్లు కుటుంబం రాలేదా, ఇలా ఎన్నో సందేహాలు ఫ్యాన్స్ నుండి వ్యక్తం అవుతున్నాయి. వీళ్ళ మధ్య జరుగుతున్న ఈవెంట్స్ ని చూస్తుంటే కొన్ని సార్లు వీళ్ళు ఆప్యాయంగానే ఉన్నారని అనిపిస్తుంది, మరికొన్ని సార్లు ఎక్కడో ఎదో గ్యాప్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ అయ్యోమయ్యం కి ఈ రెండు కుటుంబాలే మంచి సందర్భం వచ్చినప్పుడు తెరదించాలి.