Mega Family: ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తనయుడి వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈ వేడుక మాత్రం మెగా ఫ్యాన్స్ కి … ఓ స్వీట్ సర్ ప్రైజ్ లా ఉందనే చెప్పాలి. మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు. బుద్ద ప్రసాద్ తనయుడి రిసెప్షన్ కు చిరంజీవి, పవన్ కళ్యాణ్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి… మెగా బ్రదర్స్ ఫొటోలు దిగారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కలిసి ఫోటోలు వీటిని మెగా, పవన్ అభిమానులు షేర్ చేస్తూ.. తెగ సంబర పడుతున్నారు. ప్రస్తుతం మెగా అన్నదమ్ములిద్దరూ వరుస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘ ఆచార్య ’ విడుదలకు సిద్ధమవుతుండగా.. మలయాళం మూవీ ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు మెహర్ రమేశ్ డైరెక్షన్ లో ” భోళా శంకర్ ” లో కి ఒకే చెప్పగా… బాబీతో చేయబోయే సినిమాకి ” వాల్తేరు వాసు ” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే … ప్రస్తుతం రానా తో కలిసి ‘భీమ్లా నాయక్’, అనే మూవీ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ మ్విఏ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలానే మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’… హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో కూడా మరో సినిమా చేయబోతున్నాడు.