https://oktelugu.com/

Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్’ లో మాస్ మహారాజ రవితేజ..పూర్తి వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు!

డైరెక్టర్ బాబీ ఏమడిగినా కాదనుకుండా చేయడం రవితేజ కి అలవాటే. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో స్పెషల్ రోల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయగా, వెంటనే ఓకే చెప్పి చేసాడు రవితేజ.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 04:19 PM IST

    Daaku Maharaaj

    Follow us on

    Daaku Maharaaj: మన టాలీవుడ్ లో కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే స్టార్ హీరోలలో ఒకరు మాస్ మహారాజ రవితేజ. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ఇలా ఒక్కరా ఇద్దరా, ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులను ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. వీళ్లంతా రవితేజ ని ఒక దేవుడిలా చూస్తారు. తమ ప్రతీ సినిమాలో రవితేజ ప్రెజెన్స్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు వీళ్లంతా. అలా రవితేజ ని అమితంగా ఇష్టపడే దర్శకులలో ఒకడు బాబీ. ఈయన రవితేజ తో ‘పవర్’ అనే చిత్రం చేసాడు. ఆరోజుల్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇతని దర్శకత్వ ప్రతిభ ని నచ్చి పవన్ కళ్యాణ్ తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

    ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలలో కేవలం అదొక్కటే కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన ‘జై లవ కుశ’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు ఆయన బాలయ్య బాబు తో ‘డాకు మహారాజ్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని ఇటీవలే విడుదల చేయగా, దానికి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఇటీవలే డైరెక్టర్ బాబీ రవితేజ ని కలిసి ఈ విషయంలో రిక్వెస్ట్ చేయగా, ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

    డైరెక్టర్ బాబీ ఏమడిగినా కాదనుకుండా చేయడం రవితేజ కి అలవాటే. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో స్పెషల్ రోల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయగా, వెంటనే ఓకే చెప్పి చేసాడు రవితేజ. ఈ చిత్రంలో రవితేజ క్యారక్టర్ కి ఏ రేంజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమాకి వెన్నుముక లాగా నిలిచాడు రవితేజ. ఇప్పుడు అదే డైరెక్టర్ వాయిస్ ఓవర్ అడిగిన వెంటనే కాదు అనకుండా ఓకే చెప్పి తాను నమ్మిన డైరెక్టర్స్ కోసం ఎలా నిలబడుతాడో మరోసారి నిరూపించుకున్నాడు రవితేజ. బాలయ్య క్యారక్టర్ ని రవితేజ నే సినిమాలో ఆడియన్స్ కి పరిచయం చేస్తాడట. ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, రవితేజ ఎంట్రీ తో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. మరి అంచనాలను ఈ చిత్రం ఎంత మేరకు అందుకుంటుందో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.