Ravi Teja Mass Jathara Routine Story : ఈ మధ్యకాలంలో రవితేజ హీరోగా వచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించడం లేదు. కారణమేంటంటే ఆయన కథల ఎంపికలో చాలావరకు తప్పులు చేస్తున్నాడు. రవితేజ చేసిన మాస్ జాతర రేపు రిలీజ్ అవుతుండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ఈరోజు ఈవినింగ్ నుంచే వేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఆశించిన మేరకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయలేకపోయిందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది…చాలా మంది హీరోలు ప్రస్తుతం మంచి కథలతో సినిమాలు చేస్తుంటే రవితేజ మాత్రం రొటీన్ కథలనే నమ్ముకుని చేతులు కాల్చుకుంటున్నాడు. ఇప్పటికే అర డజన్ ప్లాపులతో డీలా పడిన రవితేజ ఇప్పుడు తన ఖాతాలో మరో ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడనేది వాస్తవం…
ఇక మాస్ జాతర సినిమాలో ప్రధానంగా రెండు మైనస్ అయ్యాయి. అందులో ఒకటి కథ, రెండోది స్క్రీన్ ప్లే…ఇలాంటి కథను మనం ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో చూశాం…రొటీన్ కథ అయినప్పటికీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తారనుకుంటే అది లేదు. మొత్తానికైతే రవితేజ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. మొత్తానికైతే రవితేజ లాంటి స్టార్ హీరో ఈ మధ్యకాలంలో పూర్తిగా డల్ అయిపోయాడు.
ఇక దగ్గరికి వచ్చే దర్శకులు కూడా కమర్షియల్ కథలను తీసుకొస్తున్నారు…ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ సన్నివేశాలు కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి అవి సినిమాను డిసైడ్ చేసే రేంజ్ లో లేవు… ముఖ్యంగా కథలో కొత్తదనం ఉంటే ఆటో మేటిగ్గా కొత్త సీన్లు పుట్టుకొస్తాయి. కథలో వైవిధ్యాన్ని చూపించలేనప్పుడు మనం ఎంత కొత్తగా రాయాలనుకున్న కూడా రొటీన్ గానే అయిపోతాయి. తప్ప కొత్తగా రాయలేము.
ఇక స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చిన కూడా ఈ సినిమాకి కొంతవరకు హెల్ప్ అయ్యేది. రవితేజ గతంలో చేసిన క్రాక్ సినిమా కథ రొటీన్ గా ఉన్నప్పటికి దాని స్క్రీన్ ప్లే లో దర్శకుడు కొంతవరకు వైవిధ్యాన్ని చూపించాడు. కాబట్టి ఆ సినిమా సక్సెస్ గా మారింది. ఇక అన్ని సినిమాలు అలానే సక్సెస్ ని సాధిస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు. మొత్తానికైతే భాను భోగవరపు కూడా రవితేజ అభిమానులను నిరాశపరిచాడు…