Mass Jathara Movie Advance Bookings: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) నటించిన ‘మాస్ జాతర'(Mass Jathara Movie) చిత్రం కాసేపటి క్రితమే ప్రీమియర్ షోస్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ఈ సినిమా టాక్ ఎలా ఉంటుంది?, రవితేజ కి ఈసారైనా హిట్ పడుతుందా లేదా వంటివి పక్కన పెడితే, ఈ చిత్రం అసలు ‘బాహుబలి : ది ఎపిక్’ మేనియా ని తట్టుకొని నిలబడగలదా లేదా అనే సందేహాలు ట్రేడ్ లో నెలకొన్నాయి. ఎందుకంటే ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali: The Epic) ఓపెనింగ్స్ సెన్సేషనల్ గా ఉన్నాయి. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేలా అనిపిస్తుంది. మూవీ లవర్స్ కూడా ఎక్కువ శాతం బాహుబలి ని చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజ కొత్త తరహా కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండుంటే కచ్చితంగా బాహుబలి పై మాస్ జాతర డామినేషన్ ఉండేదేమో.
Also Read: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టిన మంచు లక్ష్మి!
కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు, ఒక రొటీన్ మాస్ కమర్షియల్ మూవీ తో రవితేజ మన ముందుకొచ్చాడు. బాహుబలి లాంటి గ్రాండియర్ ని ఎదురుకోవాలంటే ఇలాంటి మాస్ సినిమాలు ఎక్కడ పనికొస్తాయి?, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో అయితే మాస్ జాతర ని అసలు పట్టించుకునేవాళ్ళు లేరు. కాకపోతే ప్రీమియర్ షోస్ వేశారు కాబట్టి, వీటికి మాత్రం మంచి ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి. ప్రీమియర్ షోస్ నుండి మంచి పాజిటివ్ టాక్ వస్తే కానీ, ఈ సినిమాకు మంచి ఓపెనింగ్ దక్కదు. మరి పాజిటివ్ టాక్ వస్తుందా లేదా అనేది మరికాసేపట్లో తేలనుంది. ఇక ఈ సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయట.
వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత కూడా రవితేజ కి ఈ మాత్రం ఓపెనింగ్ రావడం గొప్ప విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా తక్కువే. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం, కేవలం 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగిందట. రవితేజ గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ కి 40 కోట్ల రూపాయిల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఒక్క సినిమా భారీ ఫ్లాప్ అవ్వడం తో ఆయన మార్కెట్ 50 శాతం కి పైగా పడిపోయింది. ఇది చిన్న విషయం అయితే కాదు. మాస్ జాతర చిత్రం క్రాక్ రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ అయితే రవితేజ మార్కెట్ మళ్లీ తిరిగి వచ్చినట్టే అనుకోవాలి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.