Mahesh Babu Guntur Karam Teaser: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పేరు ‘గుంటూరు కారం’ అని ఫిక్స్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త.మే 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ మరియు గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే చేశారు.
ఈ టీజర్ గురించి విడుదలకు ముందే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఇందులో మహేష్ బాబు ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా చూపించినట్టు టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు లోని మాస్ యాంగిల్స్ ని ఇది వరకు మనం చాలా చూసాము, కానీ ఈ చిత్రం లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని మాస్ కోణాన్ని ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి చూపించబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఇక టీజర్ విషయానికి వస్తే, ఇది 47 సెకండ్ల నిడివి ఉంటుందట, ఇందులో ఒక ఊర మాస్ డైలాగ్ తో పాటుగా, కొన్ని యాక్షన్ షాట్స్ మరియు మహేష్ బాబు తొడ గొడితే జీప్ గాల్లోకి లేచే షాట్స్ కూడా ఉన్నాయట. టీజర్ వర్క్ ప్రస్తుతం మహేష్ బాబు డబ్బింగ్ మినహా మిగతా మొత్తం పూర్తి అయ్యింది. రేపు మహేష్ బాబు ఈ టీజర్ కి డబ్బింగ్ కూడా పూర్తి చెయ్యబోతున్నట్టు సమాచారం.
మహేష్ కెరీర్ ని ఒక్కసారి చూస్తే ఖలేజా కి ముందు, ఖలేజా కి తర్వాత అని విభజించవచ్చు. ఖలేజా చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, మహేష్ లో ఇంత కామెడీ టైమింగ్ ఉంది, వాడుకోండి అంటూ డైరెక్టర్స్ చూపించిన సినిమాగా నిల్చింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’ సినిమా కూడా ఆ రేంజ్ లో చెప్పుకునే విధంగా ఉంటుందట. చూడాలి మరి బాబు సరికొత్త మాస్ ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇవ్వబోతుంది అనేది.