Marco : గత ఏడాది విడుదలైన ‘మార్కో'(Marco Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరో గా నటించిన ఈ సినిమా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే మోస్ట్ వయొలెంట్ యాక్షన్ మూవీ గా రివ్యూస్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం పై విమర్శలు కూడా లేకపోలేదు. ఇంత హింస అవసరమా?, ఇలాంటి చెత్త సినిమాని ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్స్ చేసినవారు కూడా ఉన్నారు. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ని బాగా చూసేవారికి తప్ప, ఈ సినిమాలోని హింస ని సాధారణ ఆడియన్స్ భరించడం కష్టమే. ఇదే విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హీరో ఉన్ని ముకుందన్ ని అడగగా, సమాజంలో జరుగుతున్న హింసని మేము కేవలం 10 శాతం మాత్రమే వెండితెర పై చూపించాము అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : సెల్ఫీ అడిగితే ఫోన్ లాక్కొని జేబులో వేసుకొని వెళ్లిపోయిన ‘మార్కో’ హీరో..వైరల్ అవుతున్న వీడియో!
అయితే అనేక మంది ప్రముఖులు అసలు ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారో కూడా అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాపై యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇటీవలే ఈ మార్కో చిత్రాన్ని థియేటర్ లో చూసాము. ఆ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు చాలా అసహజంగా అనిపించాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వయొలెన్స్ ని నేను, నా భార్య తట్టుకోలేకపోయాము. నా భార్య నిండు గర్భిణీ. ఆమె సెకండ్ హాఫ్ లో హింసాత్మక సన్నివేశాలను చూసి భయపడిపోయింది. దీంతో సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడే థియేటర్ నుండి లేచి వెళ్ళిపోయాము. ఇలాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు, అంత హింస ని మేము భరించలేము’ అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.
ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ నెల 14న విడుదల అవ్వబోతున్న ‘దిల్ రూబా’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన పలు ఇంటర్వ్యూస్ లో మార్కో సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పై విధంగా స్పందించాడు. కిరణ్ అబ్బవరం కూడా తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేస్తాడు కానీ, వాటిల్లో హింస పాళ్ళు చాలా తక్కువే. సాధారణ మనుషులు ఫైటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన సినిమాల్లోని ఫైట్స్. ఇకపోతే ‘క’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం చేసిన ‘దిల్ రూబా’ చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి. కిరణ్ అబ్బవరం కి కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకం ఎంతవరకు నిజం అవుతుంది అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.
Also Read : చరిత్ర సృష్టిస్తున్న ‘జనతా గ్యారేజ్’ విలన్..’పుష్ప 2′ ని కూడా డామినేట్ చేస్తున్న ‘మార్కో’ వసూళ్లు!