
వరుస సినిమాలతో ఇండస్ర్టీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీట్ పుట్టిస్తున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రిమేక్ చేస్తున్నారు. ఇది పవన్ 26వ సినిమా. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది.
Also Read: Bigg Boss 4.. అమెరికా అల్లుడిపై అత్త మోజు..!
పవన్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా తెరకెక్కబోతోంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 15 రోజుల షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇటీవల పవన్ బర్త్‌డే సందర్భంగా #PSPK 27తో ప్రీ లుక్ రిలీజ్ చేశారు. పాన్‌ఇండియా సినిమాగా నిర్మించేందుకు క్రిష్ కృషి చేస్తున్నాడట. అయితే అన్ని భాషల్లోనూ ప్రజలందరికీ చేరవయ్యేలా టైటిల్ ఉండాలని భావిస్తున్నాడట.
అయితే.. ఇప్పటికే క్రిష్ నిర్మిస్తున్న పవన్ 27వ సినిమాకు సంబంధించి పలు టైటిల్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. వీటిలో ‘విరూపాక్ష’, ‘బందిపోటు’, ‘గజదొంగ’ టైటిల్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందరికీ చేరువయ్యేలా టైటిల్ ఉండాలని చిత్ర యూనిట్ భావిస్తుండడంతో ‘ఓం శివమ్’ పెట్టాలని అనుకుంటున్నట్లు తెలిసింది. దీంతోపాటే ‘విరూపాక్ష’ టైటిల్ కూడా పరిశీలిలనలో ఉందట.
Also Read: భారీ ప్లాప్ డైరెక్టర్ కి మెగాస్టార్ ఛాన్స్.. కారణం ?
పీరియాడికల్ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. హాలీవుడ్ నిపుణులనూ క్రిష్ రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆక్వామెన్’, ‘స్టార్ వార్స్ ఎపిసోడ్ VII-–ది ఫోర్స్ అవేకన్స్’, ‘వారిక్రాఫ్ట్’ వంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు బెన్ లాక్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఈ సినిమా తర్వాత గబ్బర్‌సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలో పవన్ నటించనున్నారు. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు.