https://oktelugu.com/

Nagarjuna Shiva Movie: శివ మూవీతో టాలీవుడ్‌లో ఎన్ని మార్పులు వ‌చ్చాయో తెలుసా.. హీరో పాత్ర నుంచి క‌థ‌ల వ‌ర‌కు..

Nagarjuna Shiva Movie: అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాలు ఒక ర‌కంగా ఉంటే.. నాగార్జున న‌టించిన శివ మూవీ వ‌చ్చిన త‌ర్వాత మ‌రో ర‌కంగా మారిపోయింది. ఒక ర‌కంగా సినిమాల ప‌రంగా స‌రికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది ఈ మూవీ. 1990 వ సంవ‌త్స‌రంలో డిసెంబరు 7 వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ.. సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. అయితే ఈ మూవీని ఓ కొత్త డైరెక్ట‌ర్ తీస్తున్నాడ‌నే వార్త‌లు అప్ప‌టికే హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 12, 2022 / 12:08 PM IST
    Follow us on

    Nagarjuna Shiva Movie: అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాలు ఒక ర‌కంగా ఉంటే.. నాగార్జున న‌టించిన శివ మూవీ వ‌చ్చిన త‌ర్వాత మ‌రో ర‌కంగా మారిపోయింది. ఒక ర‌కంగా సినిమాల ప‌రంగా స‌రికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది ఈ మూవీ. 1990 వ సంవ‌త్స‌రంలో డిసెంబరు 7 వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ.. సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. అయితే ఈ మూవీని ఓ కొత్త డైరెక్ట‌ర్ తీస్తున్నాడ‌నే వార్త‌లు అప్ప‌టికే హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆయ‌నెవ‌రో కాదు రాంగోపాల్ వర్మ. అయితే సినిమా మొద‌లైన‌ప్పుడు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ ఎప్పుడైతే పోస్ట‌ర్లు రిలీజ్ అవుతున్నాయో.. అప్ప‌టి నుంచే ఈ సినిమాపై చ‌ర్చ మొద‌లైంది.

    Nagarjuna Shiva Movie

    ఇక మూవీ విడుద‌లైన రోజు అంతా టెన్ష‌న్ గా ప్రజల అభిప్రాయం ఏంటా అని వేయి కండ్ల‌తో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకు విశేష స్పంద‌న వ‌చ్చేసింది. యూత్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ విన‌ని బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్‌, స్క్రీన్ ప్లే కొత్త‌గా క‌నిపించే స‌రికి అంతా విజిల్స్ తో సంద‌డి చేశారు. కాగా ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు దక్కించుకుంది. ఈ సినిమా వ‌చ్చిన త‌ర్వాత మూవీ ఇండ‌స్ట్రీపై పెద్ద ఎఫెక్ట్ ప‌డింది.

    Also Read: వరుణ్ తేజ్‌ తో తమన్నా రొమాన్స్.. ఇది నిజంగా సర్ ప్రైజే !

    సినిమా రూపొందించ‌డంలో చాలా మార్పులు చేసుకున్నారు. ఈసినిమా రాక‌ముందు మూస ధోర‌ణిలో వెళ్తున్న స్క్రీన్ ప్లే, మ్యూజిక్ మొత్తం కొత్త రూటు ఎంచుకుంది. ముఖ్యంగా మూవీ మేకింగ్ లో చాలా మార్పులు వ‌చ్చాయి. లైటింగ్ నుంచి స్టడీ కెమెరా దాకా ఎన్నో కొత్త టెక్నాలజీల‌ను శివ మూవీ తీసుకొచ్చింది. అంత‌కు ముందు హీరో అంటే కొన్ని రూల్స్‌ను పాటించేవారు. కానీ శివ మూవీలో రౌడీని కూడా హీరోయిజంలో చూపించేయ‌డంతో హీరోల పాత్ర‌లు కొత్త పుంత‌లు తొక్కాయి.

    ఇక శివ మూవీతో కాలేజీల్లో ఇలా ఉండాలి అనే అంశాల‌ను కొత్త‌గా తెర‌కెక్కిస్తున్నారు. అంత‌కు ముందు మూవీల్లో ఎక్కువ‌గా సెంటిమెంట్ లు మాత్ర‌మే ఉండేవి. కానీ ఈ మూవీతో ఊర మాస్ గా హీరో పాత్ర‌ను చూపించ‌డం అప్ప‌టి నుంచే స్టార్ట్ అయింది. ముఖ్యంగా క‌థ‌ల విష‌యాల్లో ర‌చ‌యిత‌లు అనేక మార్పులు చేసుకున్నారు. ఇక వ‌ర్మ మూవీతోనే కొత్త డైరెక్ట‌ర్ల‌కు అవ‌కాశాలు పెర‌గ‌డం స్టార్ట్ అయింది. అంత‌కు ముందు కొత్త‌వారిని పెద్ద‌గా న‌మ్మేవారు కాదు. ఇలా సిరీ ఇండ‌స్ట్రీలో కూడా శివ మూవీకి ముందు, శివ మూవీ త‌ర్వాత అనే మార్పులు వ‌చ్చాయి.

    Also Read: మొండి జగన్ తో జగమొండి వర్మ పోరాటం… తేడా జరిగితే వాళ్ళు మటాషే!

    Tags