
Manchu Vishnu vs Manoj : మంచు శిఖరం అగ్నిపర్వతంలా పేలింది. ఎన్నాళ్ళ నుండో నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదాలు తెరపైకి వచ్చాయి. మనోజ్ ఏకంగా ఇంటి గొడవలు రచ్చ కీడ్చారు. విష్ణు మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇది ఫ్రాంక్ కూడా కావచ్చన్న ఓ సందేహం మొదట అందరిలో కలిగింది. అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన అని తెలుసుకుని షాక్ అయ్యారు. మనోజ్ తన ఫేస్ బుక్ స్టేటస్ లో విష్ణు తన మీదకు గొడవకు వచ్చిన వీడియో షేర్ చేశారు.
మనోజ్ షేర్ చేసిన వీడియోలో… విష్ణు ఆగ్రహంగా ఉన్నారు. అతన్ని పక్కన ఉన్న సన్నిహితులు అదుపు చేస్తున్నారు. ఇలా మా వాళ్ళ మీద, బంధువుల మీద విష్ణు దాడి చేస్తున్నాడని మనోజ్ అంటున్నాడు. ఆ వీడియోలో ఆయన కనిపించలేదు. అయితే వాయిస్ ఆయనదే. వీడియో తీసింది కూడా మనోజే. ఈ గొడవ సారధి అనే వ్యక్తి నివాసంలో జరిగినట్లు సమాచారం. సారథి చాలా కాలంగా మోహన్ బాబు కుటుంబం దగ్గర పనిచేస్తున్నాడు.
మనోజ్ తమ స్టాఫ్ సారథి ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని విష్ణు అక్కడకు వెళ్ళాడు. గొడవకు సంబంధించిన వీడియో మనోజ్ సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. మోహన్ బాబు కుటుంబ గొడవలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామంతో మోహన్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి గురయ్యారట. ఆయన సీరియస్ అయ్యారట. మనోజ్ తో ముందు వీడియో డిలీట్ చేయించారట. కుటుంబ సమస్యలు రచ్చ కీడుస్తారా? పరువు తీస్తారా? అని మండిపడుతున్నారట.
అసలు సారథి ఇంట్లో ఏం జరిగిందో మోహన్ బాబు వివరాలు సేకరిస్తున్నారట. ఇద్దరు కుమారులతో మాట్లాడిన మోహన్ బాబు ఫైర్ అయ్యారట. ఇద్దరినీ ఆయన ఏకిపారేశారట. మనోజ్, విష్ణులతో మాట్లాడేందుకు ఆయన మీటింగ్ ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారట. మనోజ్ ఏకంగా విష్ణు మీద కేసు పెట్టబోయాడని సమాచారం. మంచు బ్రదర్స్ మధ్య గొడవలకు ఆస్తి పంపకాలే కారణం అంటున్నారు. కొన్నాళ్లుగా మనోజ్-విష్ణు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
https://twitter.com/TheDileep7/status/1639147744618229762