
Manchu Vishnu and Manoj : మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని కొన్నాళ్లుగా ప్రచారం అవుతుంది. మౌనికతో వివాహం, ఆస్తి వివాదాలు ఇందుకు కారణమయ్యాయని వినికిడి. ఈ పుకార్లను బలపరుస్తూ మంచు మనోజ్ విడుదల చేసిన వీడియో సంచలనం రేపుతోంది. మనోజ్ మీద గొడవకు వచ్చిన విష్ణును ఇద్దరు వ్యక్తులు అదుపు చేస్తున్నారు. ‘ఇలా మా వాళ్ళను, బంధువులను కొడుతూ ఉంటాడండి, ఇదీ సిట్యుయేషన్’ అంటూ ఆ వీడియోలో మనోజ్ మాట్లాడుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ వీడియో గమనిస్తే… మనోజ్ మీద దాడి చేయడానికి విష్ణు కోపంగా వచ్చినట్లుగా ఉంది. అదుపు చేస్తున్నా ఆయన వినడం లేదు. ఆగ్రహంగా మనోజ్ మీదకు దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది. ఎక్కడ జరిగింది? అనేది తెలియాల్సి ఉంది.
మార్చి 3న మనోజ్ తన ప్రేయసి మౌనికను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి మంచు విష్ణు హాజరు కాలేదు. అలాగే మార్చి 19వ తేదీన మోహన్ బాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మనోజ్, మౌనిక, మంచు లక్ష్మి మాత్రమే కనిపించారు. మంచు విష్ణు కానీ ఆయన భార్య పిల్లలు కానీ పాల్గొనలేదు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న చిత్ర వర్గాలు… మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు.
గత ఆరు నెలలుగా ఈ వాదన వినిపిస్తోంది. ఈ గొడవలకు ఆస్తి పంపకాలే కారణమని తెలుస్తోంది. మనోజ్, విష్ణు నటించే సినిమాలు సొంత బ్యానర్లోనే తెరకెక్కుతాయి. హీరోలుగా ఇద్దరూ ఫెయిల్. మనోజ్ కొంత గ్యాప్ తీసుకున్నారు. విష్ణు మాత్రం సినిమాలు చేస్తున్నాడు. మనోజ్ ప్రకటించిన పాన్ ఇండియా చిత్రం అహం బ్రహ్మస్మి కి మంచు ఫ్యామిలీ డబ్బులు సమకూర్చలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మంచు విష్ణు మీద పెట్టుబడి పెడుతున్న మోహన్ బాబు మనోజ్ కి అన్యాయం చేస్తున్నారనే మాటలు వినిపించాయి. మొత్తంగా మంచు కుటుంబంలో పెద్ద గొడవలే జరుగుతున్నాయని అర్థం అవుతుంది.
https://twitter.com/TheDileep7/status/1639147744618229762?s=20