Allu Arjun: అల్లు అర్జున్ కంటే నార్త్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు యంగ్ హీరో ఎవరో తెలుసా..?

స్టార్ హీరోల సినిమాలు ఇటు తెలుగులోనూ, అటు నార్త్ లోను విపరీతమైన ఆదరణను పొందుతున్నాయి. అయితే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా...

Written By: Gopi, Updated On : April 6, 2024 5:40 pm

Telugu young hero is more crazed in North than Allu Arjun

Follow us on

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఆరుగురు హీరోలు మాత్రమే మనకు ప్రత్యేకంగా గుర్తొస్తుంటారు. ఇక సీనియర్ హీరోలని మినహాయిస్తే ఈ ఆరుగురు హీరోలతోనే ఇండస్ట్రీలో భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయని చెప్పాలి. అయితే ఆ ఆరుగురు హీరోలు ఎవరంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీయార్, అల్లు అర్జున్..అయితే ప్రస్తుతం వీళ్లంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తు దూసుకుపోతున్నారు. కాబట్టి వీళ్లు చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ అవుతూ వస్తున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ స్టార్ హీరోల సినిమాలు ఇటు తెలుగులోనూ, అటు నార్త్ లోను విపరీతమైన ఆదరణను పొందుతున్నాయి. అయితే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా తన హవాని కొనసాగిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ లో అల్లు అర్జున్ కంటే కూడా ఎక్కువ క్రేజీని సంపాదించుకున్న తెలుగు యంగ్ హీరో ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు అంటే రామ్ పోతినేని ఈయన సినిమాలు హిందీ డబుడ్ వర్షన్ కి విపరీతమైన ఆదరణ లభిస్తుంది.

ఇక ఇప్పటివరకు బాలీవుడ్ లో అల్లు అర్జున్ సినిమాల కంటే ఎక్కువగా రామ్ పోతినేని సినిమాలను చూడడమే కాకుండా రామ్ పోతినేని గురించి గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారనే విషయం కూడా తెలుస్తుంది. అంటే దీని ద్వారా అల్లు అర్జున్ కంటే రామ్ పోతినేనికే బాలీవుడ్ లో ఎక్కువ ఆదరణ ఉందని ఆయన సినిమా చూడడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అక్కడి ప్రేక్షకులు చెప్పడం విశేషం…ఇక అందులో భాగంగానే ప్రస్తుతం రామ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో బాలీవుడ్ లో తను పాగా వేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియాలంటే ఇది రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మొత్తానికైతే రామ్ పోతినేని తన స్టామినా ఏంటో బాలీవుడ్ జనాలకు చూపిస్తూ ముందుకు కదలడం అనేది ఒక రకంగా మంచి విషయం అనే చెప్పాలి…