https://oktelugu.com/

Mani Ratnam Ponniyin Selvan Movie Release Date: ఐశ్వర్య రాయ్, త్రిష’ లుక్స్ తో అదరగొట్టిన లెజెండరీ డైరెక్టర్

Mani Ratnam Ponniyin Selvan Movie Release Date: క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం చేస్తున్న సినిమా “పొన్నియన్ సెల్వన్”. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో ప్రధాన పాత్రలుగా చేసిన విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవి ఫస్ట్ లుక్ లు విడుదలయ్యాయి. వీటితో పాటు చిత్రం మొదటి భాగం విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. 2022, సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక పోస్ట్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 3, 2022 / 01:38 PM IST
    Follow us on

    Mani Ratnam Ponniyin Selvan Movie Release Date: క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం చేస్తున్న సినిమా “పొన్నియన్ సెల్వన్”. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో ప్రధాన పాత్రలుగా చేసిన విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవి ఫస్ట్ లుక్ లు విడుదలయ్యాయి. వీటితో పాటు చిత్రం మొదటి భాగం విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. 2022, సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

    Mani Ratnam Ponniyin Selvan Movie Release Date

    ఇక పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన వర్క్ మరో మూడు నెలల్లో పూర్తి కానుంది. ఇక ఈ సినిమా కథ.. రాజులు, యుద్ధాల నేపథ్యంలో సాగే కథ కావడంతో సినిమాలో అత్యున్నత భారీ తారాగణం నటిస్తోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే, అందరిలో కల్లా… ఐశ్వర్య రాయ్ పాత్ర కీలకం.

    Also Read:  పాక్ – ఇండియా మధ్య యుద్ధంలో ఎన్టీఆర్ – అక్షయ్ కుమార్

    ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ మహారాణి పాత్రలో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె లుక్ కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ లుక్ లో ఐశ్వర్య రాయ్ నిజంగా మహారాణీలానే ఉంది. ఇక మణిరత్నం ఈ సినిమా తర్వాత ఇక డైరెక్షన్ చెయ్యడు అని, దర్శకత్వం పక్కన పెట్టి, నిర్మాతగా మారాలని మణిరత్నం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడని టాక్.

    Mani Ratnam

    తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ మణిరత్నం సినిమాలను నిర్మించాలనుకుంటున్నారు. కాకపోతే అవి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సంస్థలకు మాత్రమే మణిరత్నం సినిమాలు చేస్తాడట. అంటే.. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. తనకు నష్టాలు లేకుండా ఉండాలని మణిరత్నం ఆలోచన.

    ఇక ఈ “పొన్నియన్ సెల్వన్” సినిమా కథ విషయానికి వస్తే.. తమిళనాట బాగా ప్రాచుర్యం ఉన్న చోళులకు సంబంధించిన ఓ నవల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.

    Also Read:  టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    Tags