Homeఎంటర్టైన్మెంట్Mangli Controversy: మంగ్లీ, అషురెడ్డి.. ఆ పనులతో అన్ని కోట్లు కొల్లగొట్టారు..

Mangli Controversy: మంగ్లీ, అషురెడ్డి.. ఆ పనులతో అన్ని కోట్లు కొల్లగొట్టారు..

Mangli Controversy: మన సమాజం సెలబ్రిటీలకు చాలా ఇచ్చింది. పేరు, ప్రతిష్ట, హోదా, గౌరవం, ఆస్తి, అంతస్తు చాలా కల్పించింది. అంతేకాదు సోషల్ మీడియాలో వారికి విపరీతమైన పాపులారిటీ లభించేలా చేసింది. ఇంత చేసిన సమాజానికి సెలబ్రిటీలు ఏం చేయాలి.. ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. అలా తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు.. సమాజానికి నష్టం చేయకుంటే చాలు.. కానీ సెలబ్రిటీలు చేస్తోంది అదే. వచ్చిన పాపులారిటీని అడ్డం పెట్టుకొని.. సంపాదనకు పాల్పడుతున్నారు. ఆ సంపాదన కూడా అడ్డగోలుగా ఉంటున్నది.. చివరికి వారి అక్రమ వ్యవహారం బయటపడిన తర్వాత.. విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు.

మంగ్లీ మైక్రో ఫైనాన్స్

సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తోంది.. మొదట్లో ఈ వ్యవహారంలో నాకు ఎటువంటి పాత్ర లేదని, తన కుటుంబ సభ్యులను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని మంగ్లీ వాపోయింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మంగ్లీ సోదరుడి బ్యాంకు ఖాతాలలో నగదు లావాదేవీలు కనిపించాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు బదిలీ కావడం.. ఆ డబ్బులు ఉన్న వెంటనే విత్ డ్రా చేయడం అంటే పరిణామాలు పోలీసుల విచారణలో వెలుగు చూసాయి. దీంతో ఇప్పుడు ఈ కేసు మలుపు తిరుగుతోంది.

ఆషూ రెడ్డి

జూనియర్ సమంతగా పేరుపొందిన ఈమె.. ఒక సరిగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. టీవీ షోలలో మెరిసింది. అప్పట్లో రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఈమెకు విపరీతమైన పాపులారిటీ తీసుకొచ్చింది. టీవీ షోల కంటే వివాదాలతోనే ఈమె ఎక్కువ ప్రచారం పొందింది. అమెరికాకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఈమె చెప్పింది. అతడి దగ్గరనుంచి భారీగా డబ్బు, బంగారం లాగినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనితో పెళ్లికి నిరాకరించింది ఆషూ.. ఆ తర్వాత ఆమె డబ్బు తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపిస్తోంది. దీనికి తోడు అతని వద్ద తీసుకున్న డబ్బులో కొంత మాత్రమే తిరిగి ఇస్తానని చెప్పింది. అతడు దానికి ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగింది. ఆమె బెదిరింపులకు పాల్పడిన ఆడియో టేపు లు ఇప్పుడు కలకలం కలిగిస్తున్నాయి.

మంగ్లీ, ఆషూ రెడ్డికి సమాజం చాలా ఇచ్చింది. అటువంటివారు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ సమాజాన్ని ముంచకుంటే చాలు. అలాకాకుండా డబ్బుల కోసం అడ్డదారులు తొక్కి.. తమకున్న ఫేం ను అడ్డుపెట్టుకొని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడటం నిజంగా దారుణాలకే దారుణం అనిపిస్తోంది. ఇటువంటి వ్యక్తులు సెలబ్రిటీలు ఎలా అవుతారు.. సమాజానికి టార్చ్ బేరర్ లు గా ఎలా ఉంటారు.. అసలు ఇటువంటి వారిని సమాజం ఎందుకు సెలబ్రిటీలుగా గుర్తించాలి. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై పోలీసులు అత్యంత కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తు కాలంలో.. ఇటువంటి నేరాలకు పాల్పడాలనే ఆలోచన వీరిలో కలగదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version