Gaayapadda Simham Twitter Talk: డైరెక్టర్ గా ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసి , తనకంటూ యూత్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న తరుణ్ భాస్కర్ , నటుడిగా కూడా తనని తానూ నిరూపించుకున్న సంగతి తెలిసిందే. కామెడీ జానర్ సినిమాలను తెరకెక్కించడమే కాదు , తనలో అద్భుతమైన కామెడీ టైమింగ్ కూడా ఉందని అనేక సినిమాల్లో నిరూపించాడు. కానీ హీరో గా మాత్రం ఆయన సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇప్పటికే ఆయన రెండు సినిమాల్లో హీరో గా నటించాడు . వాటికి ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు, ఇప్పుడు ఆయన ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రం తో నేడు మన ముందుకొచ్చాడు. విడుదలకు ముందు ఈ సినిమా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమాకు నేడు ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం.
#GaayaPaddaSimham Opinion
Movie starts well with a good Tholi Parichayam of the name i can’t say.
Later it has Rohit Shetty mocking, Faria, Subhalekha Sudhakar, Harsha Vardhan intro, and later Tharun Bhascker intro all worked well for me.
Sree Vishnu has a very unique… https://t.co/2f1j0P1Ne0
— Vamsi Mundra (@VamsiMundra) May 1, 2026
డైరెక్టర్ ‘కశ్యప్ శ్రీనివాస్’ మంచి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టు ని ఎంచుకున్నాడట కానీ , దానిని వెండితెర పై ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో అందించడం లో విఫలం అయ్యాడని అంటున్నారు. సినిమా మంచి పేస్ తో మొదలు అవుతుందట. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి పై సెటైర్లు వేయడం, ఫరియా అబ్దుల్లా , శుభలేఖ సుధాకర్, హర్ష వర్ధన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను అనుసరిస్తూ, హీరో తరుణ్ భాస్కర్ ఎంట్రీ కూడా బాగానే ఉందట. ఇక ధర్మ గా జేడీ చక్రవర్తి క్యారెక్టర్ కూడా ఇంటర్వెల్ వరకు బాగానే ఉంటుందట. ఓవరాల్ గా డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనిపిస్తాడట , కామెడీ కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా తగ్గిందని అంటున్నారు. జేడీ చక్రవర్తి మరియు హీరో తరుణ్ భాస్కర్ మధ్య కనెక్షన్ ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు అట.
#GaayaPaddaSimham Interesting Idea, Boring Execution!
The film has an unconventional storyline that had potential to be a wacky comedy. But the screenplay turns out to be exhausting and feels like random scenes stitched together especially in the second half. The farce/spoof…
— Venky Reviews (@venkyreviews) May 1, 2026
అంతే కాకుండా, ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ చాలా గజిబిజిగా అనిపిస్తుందట. పాపులర్ సినిమాల స్పూఫ్ సన్నివేశాలు కూడా వర్కౌట్ అవ్వలేదట. డైరెక్టర్ కశ్యప్ లో చాలా పొటెన్షియల్ ఉన్నప్పటికీ, ఎందుకో సరిగా దాన్ని వెండితెర మీద డెలివరీ చేయలేకపోయాడని , ఓవరాల్ గా ఈ చిత్రం బిలో యావరేజ్ రేంజ్ లో ఉందని అంటున్నారు. శ్రీవిష్ణు క్యారెక్టర్ కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, సినిమాని కాపాడడం లో విఫలమైందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు పేలాయి, లాజిక్స్ కోసం వెతక్కుండా, కేవలం టైం పాస్ ని కోరుకునేవాళ్లకు ఈ చిత్రం నచ్చవచ్చు.
#GaayaPaddaSimham Review: Silly Plot, Stale Comedy
A plot idea involving Trump to short film-level spoofs, the film offers nothing but outdated comedy. Surprisingly, #GPS looks visually dated too, not just in writing and presentation.
From JD to Sree Vishnu, no one gets an…
— M9 NEWS (@M9News_) May 1, 2026
Sree vishnu comes with a banger
Madd writing ra babu comedy ayitheSpoofs ki ayithe theatre antha adirindhi
One of the best entertainer for this summer ; don't miss in theatres #GaayaPaddaSimham
— Shareef PSPK (@ShareefPSPK) May 1, 2026