సీనియర్ హాట్ బ్యూటీ మందిరా బేడీ భర్త చనిపోయిన గత కొన్ని రోజులుగా తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. అయితే, తన జీవితంలోని విషాదాన్ని దిగమింగుకొని మళ్ళీ రెగ్యులర్ లైఫ్ కి అలవాటు పడటానికి ప్రస్తుతం తనలో తానే తీవ్రంగా శ్రమిస్తోందట. అయితే, తన భర్త జ్ఞాపకాలను మర్చిపోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోందట. తనకు ఎక్సర్ సైజ్, యోగ అంటే పిచ్చి కాబట్టి.. ఆ పిచ్చిలోనే గడిపేయాలని భావిస్తోంది.
యోగాలో తనకు గొప్ప మానసిక ప్రశాంతత దొరుకుతుంది అని, అందుకే, నా భర్త చనిపోయిన నెల రోజుల్లోనే నేను వర్కౌట్స్ మొదలుపెట్టానని, అయితే, నా కూతురు అడిగిందనే నేను మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేశాను. నా కూతురు, నా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది అంటుంది మందిరా. ప్రస్తుతం మందిరాకి 49 ఏళ్ళు.
వయసు తక్కువ కాబట్టి.. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఆమెకు ఈ మధ్య అందరూ సలహా ఇస్తున్నారట. అయితే, తనకు ప్రస్తుతానికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చెబుతుంది. కానీ భర్త చనిపోయిన నెల రోజులకే మళ్ళీ ఎక్సర్ సైజులు అంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో పోస్టులు పెట్టడంతో ఆమె పై విపరీతంగా నెగిటివ్ ట్రోలింగ్ కి దిగుతున్నారు.
అయితే, నెగిటివ్ ట్రోలింగ్ ను మందిరా పట్టించుకునేలా లేదు. ఇక భర్త అంత్యక్రియలకు ఆమె జీన్స్ లో వెళ్లడం పై కూడా ఆమె చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా మందిరా బేడీకి విమర్శలకు కొత్తేమి కాదు. తన మనసుకు ఏది అనిపిస్తే.. అది చేస్తాను అంటూ స్వేచ్ఛగా చెప్పడం ఆమెకు బాగా అలవాటు. పైగా ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ‘సాహో’లో నటించింది మందిరా. ప్రస్తుతం కొత్తగా సినిమాలు ఒప్పుకునే ప్లాన్ లో ఉంది.