GlobeTrotter: ఇండియా గర్వించదగ్గ దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీ లో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ని ఇస్తూ సినిమా మీద హైప్ పెంచేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఈ సినిమా మొదటి అప్డేట్ స్టార్ట్ అయింది… ఇక రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. ఆమె ఎల్లో కలర్ సారీ కట్టుకొని వీరోచితమైన పోరాటం చేస్తూ చేతిలో గన్ పట్టుకొని ఫైర్ చేస్తున్న ఒక ఫోటోను రిలీజ్ చేశాడు.
ఈ ఫోటో అంతా ఇంప్రెస్సివ్ గా అనిపించలేదు. ఇక మొత్తానికైతే ఈ ఫోటోని చూసిన చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా చేసిన ‘నరసింహ’ సినిమాలో సౌందర్య ఎర్ర చీర కట్టుకున్నప్పుడు ఒక ఎద్దు ఆమెను పొడవడానికి పరిగెత్తుకుంటూ వస్తోంది. అప్పుడు రజనీకాంత్ వెళ్లి ఆమె చీర రంగు మార్చేస్తాడు.
దాంతో ఆ ఎద్దు అక్కడే ఆగిపోతోంది. ఇక దానికి సింక్ చేస్తూ ప్రియాంక చోప్రా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నప్పుడు అది చూసిన సింహం చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక అదే సమయంలో ఆమె చీర రంగును మహేష్ బాబు మార్చేస్తాడు. దాంతో సింహం అక్కడికక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి పరిగెడుతుంది. ఇక ఇదే ట్రోల్ ను వైరల్ చేస్తున్నారు.
మొత్తానికైతే రాజమౌళి ఏదో చేయాలనుకుంటే ఇంకేదో జరుగుతోంది.ఇక రాజమౌళి మాత్రం ఇలాంటి ట్రోల్స్ ను పట్టించుకోడు. రాజమౌళి ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఈనెల 15వ తేదీన ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…ఈ ఈవెంట్ లో రాజమౌళి ఎలాంటి అప్డేట్స్ ను ఇవ్వబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది…
Reason beyond Mandakini yellow Saree ❤️#GlobeTrotter pic.twitter.com/FKk2vdTwuJ
— (@Ntr1166177) November 13, 2025