Bigg Boss 9 Day 67: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) టైటిల్ విన్నర్ ఎవరు అని అడిగితే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పే పేరు తనూజ. ఈమెకు మొదటి వారం నుండే మంచి ఓటింగ్ ఉండేది. కారణం పాపులర్ టీవీ సీరియల్ హీరోయిన్. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ఆడియన్స్ లో కూడా ఈమెకు మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఒక్క ఇమ్మానుయేల్, భరణి, సుమన్ శెట్టి తప్ప ఆడియన్స్ కి తెలిసిన ముఖాలు పెద్దగా లేకపోవడం కూడా ఈమెకు బాగా కలిసొచ్చింది. ఇమ్మానుయేల్ కి కచ్చితంగా టైటిల్ కొట్టేంత స్టామినా ఉంది కానీ, ఈ పది వారాల్లో కేవలం ఆయన ఒక్కసారి మాత్రమే నామినేషన్స్ లోకి రావడం వల్ల ఫ్యాన్ బేస్ ఏర్పాటు కాలేదు. ఇప్పుడు టాప్ 3 కూడా కష్టమే అని అనిపిస్తోంది.
ఇక టీవీ సీరియల్స్ మరియు సినిమాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరైన భరణి కి విన్నింగ్ అయ్యే ఛాన్స్ మొదట్లో ఉండేది. కానీ ఆయన బంధాల ఊబిలో చిక్కుకొని ఒక ఎలిమినేట్ అయ్యి మళ్లీ రావాల్సి వచ్చింది. దీని వల్ల తనూజ ఇంకా బలపడింది. ఇక సుమన్ శెట్టి సంగతి తెలిసిందే. ఫేడ్ అవుట్ అయిపోయిన కమెడియన్ అయినప్పటికీ, మంచోడు అనే సానుభూతి ఆడియన్స్ లో ఉండడం తో అలా అలా నెట్టుకొస్తున్నాడు. ఇక కామనర్స్ నుండి హౌస్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ నాల్గవ వారం నుండి గేమ్స్ ఆడడం మొదలు పెట్టడం తో ఆయన గ్రాఫ్ బాగా పెరిగి టైటిల్ విన్నింగ్ రేస్ లో నిలిపేలా చేసింది. కానీ ఇప్పటికే తనూజ నే టాప్ లో ఉంది. ముందు నుండే ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం, అంతే కాకుండా హౌస్ లో కూడా కొన్ని సంఘటనలు ఆమెని మరింత బలోపేతం చేయడం వల్ల టైటిల్ విన్నింగ్ కి అతి చేరువకు వచ్చింది.
ఇదంతా పక్కన పెడితే ఈమె కెప్టెన్ అయ్యేందుకు మొదటి వారం నుండి ఎంతో తపన పడుతూ ఉండేది. 5 సార్లు కంటెండర్ గా వచ్చి, చివరి నిమిషం లో ఎవరో ఒకరు అన్యాయం చేయడం వల్ల ఓడిపోతూ వచ్చింది. గత వారం ఆమెకు జరిగిన అన్యాయం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ కారణం చేత ఆమె గుండెలు బాదుకుని మరీ ఏడ్చింది. కానీ ఈ వారం ఆమెకు పరిస్థితులు బాగా కలిసొచ్చాయి. ఏకంగా కళ్యాణ్ తో పోటీ పడి టాస్కులో గెలవడమే కాకుండా, ఇంటికి కెప్టెన్ కూడా అయ్యింది. సరిగ్గా ఫ్యామిలీ వీక్ లో ఆమె కెప్టెన్ అవ్వడం మామూలు రేంజ్ ఎలివేషన్ కాదు. ఆమె కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎంత సంతోషిస్తారో వచ్చే వారం చూడాలి.