Manchu Laxmi: ‘ఆ మాత్రం కళాపోషణ ఉండాలబ్బా.. లేకపోతే గొడ్డుకు మనిషికి తేడా ఎట్టుట్టాది?’ అన్నాడు మన విలన్ రావుగోపాలరావు.. అసలే మంచు ఫ్యామిలీ.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు.. అలాంటి వంశం నుంచి వచ్చిన ఆడకూతురు కూడా ఈ మధ్య ఎలానో ప్రవర్తిస్తోంది. జిమ్ చేయడాలు.. కురచ దుస్తులు వేసుకొని హాట్ ఫోజులు ఇవ్వడం.. ఇలా మంచు మోహన్ బాబు ఏకైక కూతురు మంచు లక్ష్మీ వేస్తున్న వేషాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి..

ఎవరు తీశారో ఎప్పుడు తీశారో తెలియదు కానీ.. ఒక్క ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. అది మంచు లక్ష్మీ రాములమ్మలా గెటప్ వేసుకొని నల్లటి దుస్తులు వేసుకొని పంజా విసురుతున్న ఈ పిక్ వైరల్ అవుతోంది.
అప్పట్లో విప్తవ సినిమాల్లో రాములమ్మ ఎలానైతే నక్సలైట్ గా మారి విలన్లను ఎలా చెండాడిందో అచ్చం అలాంటి గెటప్ ను వేసుకొని మంచు లక్ష్మీ తన ముచ్చట తీర్చుకుంది. బెబ్బులిలా తన పంజా విసురుతూ ఓ పిక్ ను రిలీజ్ చేసింది.
ఇకేం ముంది నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. మంచు వారి అమ్మాయి కళాపోషణకు ఫిదా అయ్యి కొందరు.. షాక్ అయ్యి మరికొందరు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఈ పిక్ షేర్ చేసిన ‘నవ్వొద్దు’ ప్లీజ్ అంటూ కండీషన్ కూడా పెడుతున్నారు. మొత్తానికి మంచు వారి అమ్మాయి పెట్టిన ఈ ఫోజు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
https://twitter.com/kotasrinumca/status/1478580709098852356?s=20