Manchu Vishnu Comments On Raja Saab OG: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ గా భావించి హీరో గా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). ఇంతకు ముందు సినిమాలు లాగా కాకుండా, ఈ సినిమాకు మంచు విష్ణు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధలు, జాగ్రత్తలు తీసుకొని, ఈ సినిమానే తన జీవితంగా భావించి తెరకెక్కించిన చిత్రమిది. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్ కి మాత్రం అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. ఏప్రిల్ నెలలోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా VFX పనులు చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఈ నెల 27 కి వాయిదా పడింది. దీంతో ఈ మూవీ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు హీరో మంచు విష్ణు. ఎడాపెడా గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.
Also Read: ఇప్పుడున్న దర్శకుల మాదిరి నేను హీరోయిన్ స్ట్రక్చర్ చూడను ముఖం మాత్రమే చూస్తాను : ఎస్ వి కృష్ణారెడ్డి
ముందుగా యాంకర్ గా విష్ణు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈ సినిమాకు మీ పుస్తకాల్లో రాసుకున్న బడ్జెట్ ఎంత’ అని అడగ్గా, దానికి మంచు విష్ణు సమాధానం చెప్తూ ‘కచ్చితంగా ట్రిపుల్ నెంబర్ ఉంటుంది’ అని అంటాడు. ట్రిపుల్ నెంబర్ అంటే వంద కోట్లు ఉండొచ్చు, 200 కోట్లు ఉండొచ్చు, రెండు మధ్య చాలా తేడా ఉంది కదా, సరిగ్గా ఎంత బడ్జెట్ అయ్యిందో చెప్పండి అని అడుగుతాడు యాంకర్. దానికి మంచు విష్ణు సమాధానం చెప్తూ ‘ఇప్పుడు నేను బడ్జెట్ చెప్తే నాపై IT రైడింగ్స్ కి వస్తారు. IT రైడింగ్ జరిగితే లెక్కలు చూపించడానికి మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ మా స్టాఫ్ మొత్తం భయపడుతుంది. వాళ్ళు రైడింగ్ కి వచ్చారంటే లేనిపోని ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు మా సినిమాకు ప్రమోషన్స్ చేసుకోవాలా?, లేకపోతే ఐటీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండాలా?’.
‘కచ్చితంగా మా సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు అయ్యింది. ఈ ఏడాది విడుదల అవ్వబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలకంటే కూడా మా సినిమాకు ఎక్కువ ఖర్చు అయ్యింది’ అని చెప్పుకొస్తాడు. అప్పుడు ‘రాజా సాబ్(Raja Saab) కంటే ఎక్కువ ఖర్చు అయ్యిందా’ అని యాంకర్ అడగ్గా, అవును దానికంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయ్యింది అని మంచు విష్ణు అంటాడు. అప్పుడు ‘ఓజీ’ అని యాంకర్ అడగ్గా, ‘ఓజీ(They Call Him OG) కి అంత బడ్జెట్ ఖర్చు అయ్యిందా?’ అని మంచు విష్ణు ఆశ్చర్యపోతూ అడిగితే, యాంకర్ అందుకు ‘అవును..దాదాపుగా 200 కోట్లు ఖర్చు అయ్యింది’ అని చెప్తాడు. అవునా, మా సినిమాకు వాటి అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
కన్నప్ప బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్ లో ఉంది.
నేను #Kannappa బడ్జెట్ చెప్తే రేపు పొద్దున్నకి IT వాళ్ళు మా ఇంటి ముందు క్యూ కడతారు. #RajaSaab #OG సినిమాల కంటే మా కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువ – హీరో @iVishnuManchu #Prabhas #PawanKalyan pic.twitter.com/Vx0BxMCkdt
— greatandhra (@greatandhranews) June 6, 2025