Maruti Brezza : మారుతి సుజుకి బ్రెజా కారు మే 2025 నెలలో ఎస్‌యూవీ అమ్మకాల్లో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio), మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) వంటి వాటిని వెనక్కి నెట్టి, టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. గత సంవత్సరం మే నెలతో పోలిస్తే, ఈ మే నెలలో మారుతి 15,566 బ్రెజా యూనిట్లను విక్రయించింది. ఇది క్రెటా 14,860 యూనిట్లు, స్కార్పియో 14,401 యూనిట్ల అమ్మకాల కంటే ఎక్కువ. మారుతి ఫ్రాంక్స్ కేవలం 13,584 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.
మారుతి బ్రెజా బేస్ మోడల్ ధర రూ.8.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.14.14 లక్షల (షోరూమ్ ధర) వరకు ఉంటుంది. ఇది ఎల్‌ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్‌ఎక్స్ఐ, జెడ్‌ఎక్స్ఐ+ రకాల్లో (వేరియంట్స్) అందుబాటులో ఉంది. ఇందులో పెట్రోల్, ఆటోమేటిక్, సీఎన్‌జీ (CNG) ఆప్షన్లు కూడా ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి బ్రెజాను 2022లో విడుదల చేశారు. ఇది రెండో తరం మోడల్, దీనికి ముందు తరం బాడీ షెల్ వేదికనే వాడారు. కానీ ఇందులో పెద్ద మార్పులు చేశారు.
Also Read : మారుతి బ్రెజ్జా కొనాలని చూస్తున్నారా.. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి.. ఈఎంఐ ఎంత ఉంటుందో తెలుసా ?
బ్రెజా ఎక్సటర్నల్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు అద్భుతమైన లుక్ అందిస్తాయి. డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్, రూఫ్ రెయిల్స్ దీనికి ప్రీమియం ఎస్‌యూవీ రూపాన్ని ఇస్తాయి. బ్రెజా రోడ్డుపై ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దాని బాక్స్ లాంటి షేప్ దానికి స్పెషల్ లుక్ ఇస్తుంది. భారతీయ వినియోగదారుల మారుతున్న అవసరాలు, అంచనాలను దృష్టిలో ఉంచుకొని బ్రెజాను రూపొందించారు. ఈ చిన్న ఎస్‌యూవీ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, ఫీచర్లు, సేఫ్టీ, పర్ఫామెన్స్ విషయంలో కూడా మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంది.
బ్రెజా లోపలి భాగం చాలా అద్భుతమైన ప్రీమియం ఫీచర్లు, టెక్నాలజీతో నిండి ఉంది. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, సుజుకి కనెక్ట్ వంటి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్రెజాలో 1.5-లీటర్ కె15సీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 103.26 బిహెచ్‌పి bhp పవర్ 136.8 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో (ట్రాన్స్‌మిషన్) వస్తుంది. దీనితో పాటు, సీఎన్‌జీ మోడల్ కూడా అందుబాటులో ఉంది. ఇది కిలోగ్రాముకు 25.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే బ్రెజా అన్ని రకాల్లో 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, పిల్లల సీట్ల కోసం ఐఎస్‌ఓఎఫ్ఐఎక్స్ మౌంట్లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు తప్పనిసరిగా ఉంటాయి. వీటితో పాటు, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.