Kannappa satellite rights: నిర్మాతలకు ఈమధ్య కాలం లో థియేటర్స్ నుండి వచ్చే డబ్బులతో సంబంధం లేకుండా, కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే సేఫ్ జోన్ లోకి వెళ్తున్న సందర్భాలను ఎన్నో మనం చూసాము. అందుకే నిర్మాతలు ఈమధ్య కాలం లో మీడియం రేంజ్ హీరోలకు కూడా భారీ బడ్జెట్స్ పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఆ ధైర్యం తోనే మంచు విష్ణు(Manchu Vishnu) ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ,థియేటర్స్ నుండి కాలక్షన్స్ మాత్రం రావడం లేదు. అయితే విడుదలకు ముందు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ఒక ప్రముఖ సంస్థకు అమ్మాలని చూసాడు. కానీ ఆ సంస్థ మాత్రం మంచు విష్ణు అడిగినంత డబ్బులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
అప్పుడు విష్ణు ఎంతో నమ్మకంతో, నేను అడిగిన రేట్ ఇప్పుడు కాదు,సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక ఇవ్వు అని అన్నాడట. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో ‘ఆ ప్రముఖ ఓటీటీ సంస్థ చైర్మన్ కి చెక్ రెడీ చేసుకోండి సార్ అని అన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఓటీటీ డీల్ ముగిసిందో లేదో ఇంకా తెలియదు కానీ, హిందీ శాటిలైట్ రైట్స్ మాత్రం హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ హిందీ ఛానల్ కి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. ఓటీటీ దెబ్బకు శాటిలైట్ బిజినెస్ ఢమాల్ అని పడిపోయిన ఈ రోజుల్లో ఇంత మొత్తానికి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ‘దేవర’ లాంటి భారీ హిట్ సినిమాకు సంబందించిన శాటిలైట్ రైట్స్ ఇంత వరకు అమ్ముడుపోలేదు. అంత పెద్ద హీరో సినిమా శాటిలైట్ రైట్స్ అటు తెలుగు వెర్షన్ కి కానీ, హిందీ వెర్షన్ కి కానీ అమ్ముడుపోలేదు.
అలాంటిది కన్నప్ప శాటిలైట్ రైట్స్ అమ్ముడుపవడం గొప్పే మరి. దీంతో మంచు విష్ణు కి పెట్టిన బడ్జెట్ లో కాస్త రికవరీ జరిగింది. మంచు విష్ణు సినిమాని థియేటర్స్ కి వెళ్లి మూడు గంటల సినిమా చూసేందుకు ఆడియన్స్ సంకోచిస్తారేమి కానీ, ఓటీటీ లో టైం పాస్ కోసం చూసేందుకు మాత్రం ఏ మాత్రం ఆలోచించరు. కాబట్టి ఓటీటీ లో కూడా ఈ చిత్రం కచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉండడం తో అమెజాన్ ప్రైమ్ ఫైనల్ డీల్ లాక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మంచు విష్ణు థియేటర్స్ లో విడుదలైన 8 వారాల వరకు ఓటీటీ లో విడుదల చేయడానికి వీలు లేదు అనే ఒప్పంద పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం నాలుగు వారాలకు కుదించే అవకాశాలు కూడా ఉన్నాయి.