Manchu Vishnu: సన్నీలీయోన్, పాయల్ ను కూడా వదలవా మంచు విష్ణు?

Manchu Vishnu: సన్నీ లియోన్, పాయల్ పక్కనుంటే నన్నెవరు చూస్తారు అంటున్నారు మంచు విష్ణు. ఆయన ఫ్లో అన్నా అది నిజం కూడా. ఈ మంచు హీరో ఫేడ్ అవుటై చాలా కాలం అవుతుంది. డబ్బులు దండిగా ఉండడంతో సొంత బ్యానర్ లో సినిమాలు తీసుకుంటున్నాడు. మంచు విష్ణు హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోతుంది. ఆయన గత చిత్రం మోసగాళ్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కాజల్, సునీల్ శెట్టి వంటి స్టార్ క్యాస్ట్ నటించినా ఫలితం […]

Written By: Shiva, Updated On : September 10, 2022 1:57 pm
Follow us on

Manchu Vishnu: సన్నీ లియోన్, పాయల్ పక్కనుంటే నన్నెవరు చూస్తారు అంటున్నారు మంచు విష్ణు. ఆయన ఫ్లో అన్నా అది నిజం కూడా. ఈ మంచు హీరో ఫేడ్ అవుటై చాలా కాలం అవుతుంది. డబ్బులు దండిగా ఉండడంతో సొంత బ్యానర్ లో సినిమాలు తీసుకుంటున్నాడు. మంచు విష్ణు హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోతుంది. ఆయన గత చిత్రం మోసగాళ్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కాజల్, సునీల్ శెట్టి వంటి స్టార్ క్యాస్ట్ నటించినా ఫలితం లేకపోయింది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మంచు విష్ణుకు నిరాశే మిగిల్చింది.

Manchu Vishnu, Sunny Leone

ఆయన లేటెస్ట్ మూవీ జిన్నా. ఈ చిత్ర టీజర్ విడుదల ఈవెంట్ లో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిన్నా నా కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం, కచ్చితంగా విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. భిన్నమైన కాన్సెప్ట్ తో జిన్నా చిత్రాన్ని దర్శకుడు రూపొందించారు అన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్స్ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సన్నీ లియోన్ ని హీరోయిన్ గా అనుకున్నపుడు ఒకింత సంశయించాము. గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ కలిగిన ఆమె సెట్ అవుతుందా అనే అనుమానం కలిగిందని మంచు విష్ణు అన్నారు.

జిన్నా సినిమా కోసం పాయల్, సన్నీ వంటి గ్లామరస్ హీరోయిన్స్ ని తీసుకున్నాం. ఈ ఇద్దరు బ్యూటీస్ పక్కన ఉంటే ఇంక నన్నెవరు చూస్తారనే ఫీలింగ్ కలిగిందని మంచు విష్ణు మీడియా ముందు ఓపెన్ గా చెప్పారు. హీరోయిన్స్ అందాన్ని పొగిడే క్రమంలో మంచు విష్ణు సెల్ఫ్ సెటైర్ వేశారు. జిన్నా చిత్రానికి ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. మంచు విష్ణు ఈ మూవీలో టెంట్ హౌస్ బాయ్ గా కనిపిస్తాడట. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. విష్ణు కూతుళ్లు అరియానా, వివియాన ఓ పాట పాడటం విశేషం.

Manchu Vishnu, Rajput and Sunny Leone

తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో జిన్నా విడుదల కానుంది. ఇక ఈ టైటిల్ పై కొంత వివాదం నడిచింది. మొదట్లో గాలి నాగేశ్వరరావు అనే టైటిల్ అనుకున్నారు. కారణం తెలియదు కానీ జిన్నా గా మార్చేశారు. హిట్ లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు జిన్నా తో అయినా విజయం దక్కుతుందేమో చూడాలి. కాగా గత ఏడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ ని ఓడించి పదవి చేపట్టారు. ఈ ఎన్నికలు అనేక వివాదాలకు కేంద్రబిందువయ్యాయి.

Tags