Manchu Vishnu Ginna Movie: ఇండస్ట్రీ లో మంచు కుటుంబానికి ఉన్నంత డబ్బు ఎవరికీ లేదు అని నిరూపించుకోవడానికి మోహన్ బాబు మరియు మంచు విష్ణు తహతహలాడుతున్నారా..?, వీళ్ళ చర్యలు చూస్తూ ఉంటె అలాగే అనిపిస్తుంది..ఇటీవలే మంచు విష్ణు హీరో గా నటించిన జిన్నా సినిమా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..కమర్షియల్ ఫార్ములా తో పాయల్ రాజ్ పుట్ మరియు సన్నీ లియోన్ తో పాటుగా క్రేజీ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా అతి దారుణమైన కలెక్షన్స్ రావడం ట్రేడ్ పండితులని సైతం ఆశ్చర్య పరిచింది.

మొదటి రోజు ఈ సినిమాకి కేవలం 12 లక్షల రూపాయిలు మాత్రమే షేర్ వచ్చింది..అన్నీ ప్రాంతాలలో డే డెఫిసిట్స్ వచ్చాయి..కనీసం థియేటర్ కి అయ్యే రెంట్ ఖర్చులు మరియు కరెంటు బిల్లులను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది..డిస్ట్రిబ్యూటర్స్ కి ఎదురు రెంట్స్ ఇచ్చి థియేటర్స్ లో ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది అని నెటిజెన్స్ అంటున్నారు.
ఇలాంటి పరిస్థితి లో ఒక సినిమా నడుస్తున్నప్పుడు ఎవరైన సక్సెస్ మీట్ పెడుతారా?..కానీ మన మంచు విష్ణు పెట్టాడు..సక్సెస్ మీట్ ని ఏర్పాటు చెయ్యడమే కాకుండా ఆయనగారి తండ్రి మోహన్ బాబు ని పిలిపించుకున్నాడు..ఇక తెలిసిందే గా..ఆ సినిమా ఎదో బాహుబలి రేంజ్ లో హిట్ కొట్టినట్టు పుత్రోత్సాహం తో పొంగిపోతూ నాలుగైదు డబ్బా మాటలు చెప్పుకున్నాడు..ఇలా సక్సెస్ మీట్ పెట్టి డబ్బా కొట్టించుకోవడానికి మంచు విష్ణు సుమారుగా 20 లక్షలు ఖర్చు చేసాడట..సినిమాకి మొదటి రోజు వచ్చిన వసూళ్లే 12 లక్షలు అయితే..దానికి 20 లక్షలు పెట్టి సక్సెస్ మీట్ చేసాడు అని వింటుంటే ఎంత నవ్వు వస్తుందో కదూ..!మంచు కుటుంబం అన్నీ ఇలాంటి వింత పనులే చేస్తారు..మళ్ళీ దానికి నెటిజెన్స్ వెక్కిరిస్తే మా మీద ఎవరో కుట్ర చేయిస్తున్నారు..20 మంది ఎంప్లాయిస్ ని పెట్టిమరీ నా మీద..నా కుటుంబం మీద ట్రోల్ల్స్ వేస్తున్నారు అంటూ మీడియా ముందు మాట్లాడుతాడు.

ఇలాంటి వింత చేష్టలు చేస్తే ఎవరైనా ట్రోల్ చెయ్యడం సహజమే కదా అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో అంటున్నారు..డబ్బులు ఎక్కువ ఉంటె అనాధలకు దానం చెయ్యొచ్చుకదా..అలా పనికిమాలిన సినిమాలు తీసి ఎందుకు క్రెడిబిలిటీ పోగొట్టుకోవాలని నెటిజెన్స్ అంటున్నారు.