Manchu Vishnu
Vishnu Manchu: మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, విష్ణులతో మనోజ్ విభేదించాడు. వారిద్దరిపై ఆరోపణలు చేశాడు. వారు తిరిగి మనోజ్ పై విమర్శలు గుప్పించారు. తిరుపతిలో గల శ్రీవిద్యా నికేతన్ యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయనేది మనోజ్ ఆరోపణ. ఇక మనోజ్ తాగుడుకు బానిసై, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడని మోహన్ బాబు ఓ ఆడియో సందేశంలో తెలియజేశాడు.
పరస్పరం దాడులు చేసుకోవడం తో పాటు కేసులు పెట్టుకున్నారు. ఇటీవల తిరుపతిలో మనోజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఆస్తుల పంపకాల దగ్గరే వివాదం నెలకొందనే వాదన ఉంది. మనోజ్ లీగల్ గా మోహన్ బాబు, విష్ణులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడు. మనోజ్-విష్ణు దారుణమైన పదజాలంతో సోషల్ మీడియాలో విమర్శలు చేసుకున్నారు.
తాజాగా కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో కుటుంబ కలహాల మీద స్పందించాడు. శివుడు ప్రత్యక్షమై వరమిస్తే.. మళ్ళీ మోహన్ బాబుకే కొడుకుగా పుట్టాలని వరం కోరుకుంటాను. ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. మా కుటుంబంలో నెలకొన్న వివాదాలు త్వరగా తొలగిపోవాలని కోరుకుంటాను. అమ్మతో కలిసి జీవించాలని, పిల్లలతో మంచి వాతావరణంలో పెరగాలని ఉందని, విష్ణు అన్నారు.
మోహన్ బాబు రెండో భార్య మనోజ్ కి తల్లి. విష్ణు, మంచు లక్ష్మిల తల్లి మరణించడంతో మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నారు. గతంలో వీరందరూ కలిసి జీవించేవారు. కొన్నాళ్ళుగా మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. మోహన్ బాబు ఇష్టానికి వ్యతిరేకంగా భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నాడని సమాచారం. పెళ్ళికి ఏడాదిన్నర కాలం భూమా మౌనిక-మనోజ్ చెన్నైలో రహస్యంగా కాపురం ఉన్నారట.
మౌనికతో వివాహం అనంతరం మనోజ్-విష్ణు వివాదాలు తెరపైకి వచ్చాయి. మోహన్ బాబు ఆస్తుల పంపకాల విషయంలో విష్ణుకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చారని, అందుకే మనోజ్, మంచు లక్ష్మి గుర్రుగా ఉన్నారనే పుకార్లు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప మూవీ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు మోహన్ లాల్ వంటి స్టార్స్ భాగమయ్యారు. కన్నప్ప ఏప్రిల్ 25న విడుదల కానుంది. మోహన్ బాబు సైతం ఓ కీలక రోల్ చేశాడు.
Web Title: Manchu vishnu who opened his mouth on family quarrels
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com