Manchu Vishnu Kannappa: సూపర్ స్టార్ రజనీకాంత్(Super star Rajinikanth) ‘జైలర్’ చిత్రాన్ని మీరంతా చూసే ఉంటారు. ఇందులో సునీల్(Comedy Sunil) ‘బ్లాస్ట్ మోహన్’ క్యారక్టర్ చాలా ఫన్నీ గా ఉంటుంది. బాగా డబ్బున్న కోటీశ్వరుడు, సినిమాలు అంటే పిచ్చి. తనకు తోచిన విధంగా సినిమాలు తీస్తూ జనాలను హింసిస్తూ ఉంటాడు. ఒక రివ్యూయర్ తన సినిమాకు నెగటివ్ రివ్యూ రాయడాన్ని గమనించి అతన్ని పిలిపించి ఒక చెట్టుకు కట్టేస్తాడు. సునీల్ పక్కనే ఉన్న అసిస్టెంట్ ‘వీడు యూట్యూబ్ లో మన సినిమాని చూసి తప్పు తప్పుగా రాసాడు బాబు’ అని చెప్తాడు. దానికి ఆ రివ్యూయర్ కి పది లక్షల అడ్వాన్స్ చెక్ ఇచ్చి ‘ఇదిగో పది లక్షల చెక్..నా తదుపరి చిత్రానికి నువ్వే డైరెక్టర్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, వేరే రివ్యూయర్ మన సినిమా గురించి చెడుగా రాస్తే నువ్వు ఛస్తావ్’ అని అంటాడు.
Also Read: నిన్న సఫారీలు, నేడు కరేబియన్లు.. సుదీర్ఘ ఫార్మాట్ లో కంగారుల పని ఖతమేనా?
సినిమాలో జరిగిన ఈ సన్నివేశాన్ని మంచు విష్ణు(Manchu Vishnu) నిజ జీవితం లో చేసి చూపించాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నాకు నచ్చిన ఔట్పుట్ కావాలి. నాకు VFX మీద ఫుల్ టెన్షన్ ఉంటుంది. చాలా మందికి తెలియనిది ఏమిటంటే, మొదట్లో టీజర్ వచ్చినప్పుడు VFX షాట్స్ లో కొన్ని తప్పులున్నాయని ఇద్దరు ముగ్గురు కూర్చొని రివ్యూ చేశారు. యూట్యూబ్ లో నేను ఈ రివ్యూస్ ని చూసాను. అలా రివ్యూ చేసిన ఆ నలుగురిని ఇప్పుడు నేను హైర్ చేసుకున్నాను. విమర్శలు సమంజసంగా ఉన్నప్పుడు ఆ విమర్శలను పాజిటివ్ గా తీసుకోవాలి. వాళ్ళ విమర్శలను నేను పాజిటివ్ గా తీసుకున్నాను. వాళ్ళు VFX క్వాలిటీ ని చెక్ చేసి ఓకే చేస్తే కానీ ఇప్పుడు ఫైనల్ VFX షాట్స్ ఓకే అవ్వదు’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. వాస్తవానికి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చాలా తెలివైనదే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ‘కన్నప్ప'(Kannappa Movie) విషయానికి వస్తే నేడే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. మంచు విష్ణు నుండి ఈ రేంజ్ పెర్ఫార్మన్స్ వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదంటూ మంచు మనోజ్ లాంటోళ్ళు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం మంచు మనోజ్ మాత్రమే కాదు,సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు సెకండ్ హాఫ్ గురించి, చివరి 15 నిమిషాల గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ని ఆడియన్స్ క్షమిస్తే కచ్చితంగా ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బయ్యర్స్ అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనేది.
https://t.co/Rcoy8zBKHF pic.twitter.com/qDAchjpN8z
— Vihaan Mom #TeamVihaan (@VihaanMom) June 27, 2025