https://oktelugu.com/

Manchu Vishnu : తమ్ముడు మంచు మనోజ్ తో గొడవలపై ఎట్టకేలకు సంచలన విషయాలు పంచుకున్న మంచు విష్ణు

Manchu Vishnu : టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలలో ఒకటి మంచు కుటుంబం. మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu ) తర్వాత తన ఇద్దరు కొడుకులు, కుమార్తె కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Written By: , Updated On : February 24, 2025 / 01:33 PM IST
Manchu Vishnu

Manchu Vishnu

Follow us on

Manchu Vishnu : టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలలో ఒకటి మంచు కుటుంబం. మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu ) తర్వాత తన ఇద్దరు కొడుకులు, కుమార్తె కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎంత పేరు తెచ్చుకున్నారో వారసత్వంగా ఎంట్రీ ఇచ్చిన వీళ్ల ముగ్గురిలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ విధంగా రాణించలేకపోయారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ హిట్ సినిమా కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక మంచు విష్ణు ( Manchu Vishnu ) తాజాగా తన డ్రీం ప్రాజెక్టు కన్నప్పతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. దాదాపు 200కోట్లు ఖర్చు పెట్టి హిట్ కోసం తాపత్రయపడుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్ డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్పలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్‌ హీరోయిన గా యాక్ట్‌ చేస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైన దగ్గర నుంచి ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ రీసెంటుగా విడుదలైన శివ శివ శంకరా.. పాటతో ట్రోలింగ్‌ అంతా తుఫానులా కొట్టుకుపోయింది. అయితే ఇటీవల మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచి విష్ణు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఎట్టకేలకు తన కుటుంబంలో జరుగుతున్న గొడవల మీద స్పందించాడు.

మంచు విష్ణు ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. కన్నప్ప సినిమా బడ్జెట్‌ విషయంలో ఇప్పటికీ తన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. సినిమా మీద ఎంతో నమ్మకంగా ఉన్నా.. అయినా సక్సెస్‌- ఫెయిల్యూర్‌ రెండూ మోసగాళ్లే. ఈ సినిమాను ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. కన్నప్ప మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వేసవి కానుకగా ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఈ మూవీలో సినీ ఇండస్ట్రీలోని దాదాపు ప్రముఖ స్టార్లు అంతా నటిస్తున్నారు.

ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సందర్భంలోనే మంచు విష్ణు తన కుటుంబంలో జరుగుతున్న గొడవల గురించి స్పందించారు. ప్రస్తుతం తాను చేస్తున్న కన్నప్ప ప్రాజెక్టు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుమని అడిగితే.. తనకు జన్మజన్మలకు మోహన్ బాబునే తన తండ్రిగా ఇవ్వాలని అడుగుతానని విష్ణు అన్నాడు. వాళ్ల కుటుంబంలోని గొడవలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడితే బాగుండు అనిపిస్తోందన్నారు. తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమన్నారు. తను వాళ్ల అమ్మానాన్నతో ఉండాలన్నారు. తన పిల్లలు తాను పెరిగిన అలాంటి కుటుంబ వాతావరణంలోనే పెరగాలని కోరుకున్నారు. ఇక ట్రోలింగ్ విషయానికొస్తే ఇలాంటివి ప్రతి ఇంట్లోనే ఉంటాయి అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం మంచు విష్ణు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.