Legendary Producer: సినిమా నిర్మాత బంగారుబాతు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ బాతును పీక్కు తినడానికి పోటీ పడుతున్నారు. ఆఫీస్ లో రోజు ఖర్చుల్లో మోసం చేసే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి.. తమ లెక్కల మాయాజలంతో జలగలా రక్తం పీల్చే మేనేజర్లు వరకూ.. అలాగే సాంకేతిక నిపుణులు, దర్శకులు ఇలా ఒక్కరు ఏమిటీ ?, నిర్మాతను మోసం చేయడానికి ఎందరో కాసుకుని కూర్చుంటున్నారు. ఇందరి మధ్య ఆ బాతు ఎలా బతికి బయట పడుతుంది ?, అందుకే.. లాభాలతో బయట పడే బాతులు చాలా అరుదు అయిపోయాయి. అసలు, బంగారు గుడ్డు పెట్టే బాతు ఒట్టిపోతే నష్టం ఇండస్ట్రీకే అని ఇంగితజ్ఞానం కూడా ఉండటం లేదు కొందరి సినిమా వాళ్లకు.

నిజానికి ఆ బంగారుబాతుకి శుభ్రంగా మేతేసి చక్కగా నీళ్లుపట్టి చాలాకాలం పాటు కాపాడుకుంటే.. ఆ బాతు రోజు చక్కగా బంగారు గుడ్డు పెడుతూనే ఉంటుంది. అప్పుడు ఆ గుడ్డు పై ఆధార పడే సినీ కార్మికుల దగ్గర నుంచి హీరోల వరకూ అందరికీ ఆ గుడ్డు ప్రతిఫలం చక్కగా అందుతుంది. కానీ, టాలీవుడ్ లో జరుగుతుంది ఏమిటీ ?, రోజు ఒక్కో గుడ్డు కోసం ఆగే ఓపిక లేని వారంతా ఆ బాతు దగ్గరకు చేరి.. ఆ బాతును ఒకేసారి కోసేసి.. ఒకేసారి చాలా గుడ్లును తినెయ్యాలని ఉబలాట పడుతున్నారు.
ఫలితంగా ఆ బాతు ఏ నక్కకి కుక్కకి కూడా ఉపయోగ పడకుండా పోతుంది. ఇక్కడ తప్పు ఎవరిది ?, అతి తెలివి ఉన్న దర్శకులు అన్నీ చోట్ల ఉంటారు. లేనిపోని కబుర్లు చెప్పి.. నిండా మంచే క్రియేటివ్ కాపీ రాయుళ్లకు టాలీవుడ్ లో కొదవే లేదు. బాతును కోస్తే రక్తమాంసాలు తప్ప.. రోజు వచ్చే గుడ్డు కూడా రాదు అనే కనీస జ్ఞానం కూడా ఉండటం లేదు వీరికి. ఇలాంటి వారి వల్ల.. ఇండస్ట్రీ ప్రతి యేటా 170 డిజాస్టర్ సినిమాలతో తల్లడిల్లిపోతోంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఓ స్టార్ నిర్మాత కూడా ఎదుర్కోవడం దురదృష్టకరం.

ఆయనకు సినీ నిర్మాణంలో ముప్పై ఏళ్ల అనుభవం ఉంది. పైగా ఆయన కుమార్తెలు కూడా నిర్మాణంలోనే ఉన్నారు. పైగా ఇండస్ట్రీలో ఆయనకు బంగారు బాతు అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆ పేరుకు ఆయన న్యాయం చేశారు. ఓ స్టార్ దర్శకుడిని నమ్మి ఓ తమిళ భారీ రీమేక్ సినిమా రైట్స్ ను కొన్నారు. ఆ సినిమా ఆయన కుమార్తెలకు నచ్చలేదు. వయసు పెరిగిన ఆ చాదస్తపు పెద్దాయనకు, అనుభవం లేని కూతుర్ల మాటలు నచ్చలేదు. వాళ్లకు ఇష్టం లేకుండానే ఆయన ఆ సినిమాను స్టార్ట్ చేశాడు.
తండ్రికి గొప్ప నిర్మాత అని గొప్ప పేరు ఉంది. అందుకే, ఆయన కూతుర్లు ఆయన ఇష్టానికి గౌరవం ఇచ్చారు. కానీ.. ఆ సినిమా విషయంలో ఇప్పటికే ఈ నిర్మాత గారు దాదాపు పది కోట్లు నష్టపోయారు. సినిమా కూడా మొదలు కాకుండానే పది కోట్లు అదనపు ఖర్చు అంటే.. ఇదేదో ఒక్కరోజు బంగారు బాతు వ్యవహారంలాగే ఉంది. అందుకే.. కూతుర్లు అసలు విషయం తెలుసుకోవడానికి తమ పద్దతిలో లెక్కలు ఆరా తీశారు. ఇలాంటి విషయాలను రాబట్టడంలో.. ఆయన పెద్ద కూతురుకి గొప్ప టాలెంట్ ఉంది. ఎవరిని ఎలా డీల్ చేయాలో ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె తెలివి పై జూనియర్ ఎన్టీఆర్ సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా?,
తమ పార్టీకి ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర పని చేసే కో డైరెక్టర్ ను ఆమె ఆహ్వానించింది. మత్తులో మునిగిన అతను ఆ స్టార్ డైరెక్టర్ పనితనం మొత్తం.. ఆమె ముందు కక్కాడు. ఆ డైరెక్టర్ ఈ సినిమా మీదే అసలు దృష్టే పెట్టడం లేదట. నిత్యం అతను కూడా మత్తులో మునిగితేలుతున్నాడట. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ డైరెక్టర్ గ్లాస్ పార్టనర్ ఈ పెద్దాయనే అట. ఇద్దరు మత్తులో మునిగి లెక్కలు పట్టించుకోక పోవడంతో ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి సహా నిర్మాత వరకూ అందరూ దోచుకోవడం మొదలు పెట్టారని.. పది కోట్లు వరకూ లెక్క తారుమారు అయిందని అతగాడు అసలు విషయం కక్కేసాడు. గోడకేసిన సున్నం, సినిమా ఇండస్ట్రీలో పోయిన డబ్బు వెనక్కి తిరిగి రాదు. అందుకే, ఆ నిర్మాత కూతుర్లు.. ఆయన దగ్గర నుంచి చెక్ బుక్ లు, బ్యాంక్ ఖాతాలు అన్నీ లాగేసుకున్నారు. పైగా చిన్నాచితక ఖర్చులకు కూడా తమ దగ్గరే తీసుకునేలా కూతుర్లు ప్లాన్ చేయడంతో ఆ పెద్దాయనకు తల కొట్టేసినట్టు అయ్యింది. దాంతో ఆ అవమానం బరించలేక ఆయన ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చివరకు ఈ పెద్దాయన వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ