Manchu Vishnu :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ కోసం చిత్ర యూనిట్ క్యాస్టింగ్ కాల్ ను అనౌన్స్ చేసింది. నటనపై ఆసక్తి ఉన్న వాళ్లకు ప్రభాస్ సినిమాలో నటించే సువర్ణావకాశం అందిస్తుంది యూనిట్. వయసుతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులు, పిల్లలు అందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నట్లు భద్రకాళి పిక్చర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఆసక్తి ఉన్న వారు తమ ప్రొఫైల్స్ ను పంపించుకోవాలని కోరుతూ ఓ మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. అయితే దీనికి మంచు విష్ణు కూడా అప్లై చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆసక్తి ఉన్న వాళ్లు రెండు నిమిషాల వీడియోతో పాటూ వారి ఫోటోలను మెయిల్ చేయాలని సూచించారు. అయితే ఈ విషయంపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. స్పిరిట్ క్యాస్టింగ్ కాల్ కు తాను కూడా అప్లై చేసుకున్నానని, వెయిట్ చేసి చూద్దాం ఏమవుతుందో అని ట్వీట్ చేశాడు విష్ణు. దీంతో విష్ణు చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న పోస్టులో ”అబ్బా! నేను కూడా దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పుడు వెయిట్ చేసి చూద్దాం” అంటూ ఆ ట్వీటులో పేర్కొన్నాడు.
మంచు విష్ణు సరదాగా అన్నాడో, నిజంగానే ప్రభాస్ సినిమాలో నటించాలని ఆశ పడుతున్నాడో తెలీదు గానీ తను చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆల్ ది బెస్ట్ చెబుతూ పాజిటివ్ ట్వీట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఎప్పటిలాగే ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు హీరోగా అవకాశాలు రావడం లేదా అందుకే ఇలా వెతుక్కుంటున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్, సందీప్ ఈ అప్లికేషన్ ను పక్కా రిజెక్ట్ చేస్తారంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
విష్ణు నిజంగానే స్పిరిట్ క్యాస్టింగ్ కోసం అప్లై చేశాడో లేక.. సరదాగా అలా పోస్ట్ చేశాడో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే మంచు ఫ్యామిలీతో ప్రభాస్ కు మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. విష్ణు తండ్రి మోహన్ బాబుతో ప్రభాస్ కు మంచి బాండింగ్ ఉంది. ప్రభాస్, మోహన్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు కీలక పాత్ర కూడా చేశాడు. ఇక ఇప్పుడు తాజాగా మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఏకంగా గెస్ట్ రోల్ చేస్తున్నాడు.