Manchu Vishnu Prakash Raj: ‘మా’ ఎన్నికల నేపథ్యంలో నిన్నటి వరకు సభ్యుల మధ్య ఆరోణలు, అవమానాలతో మాటల యుద్ధం జరిగింది, నేడు ఓదార్పుల పలకరింపు మొదలైంది. మొత్తానికి ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పై ఘన విజయాన్ని సాధించాడు. ఆ అవమానాన్ని సహించలేని ప్రకాష్ రాజ్ ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి.. మొత్తమ్మీద ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పనిలో పనిగా పర్సనల్ గా విష్ణుకు కూడా ఒక మెసేజ్ పెట్టాడు.

ప్రకాశ్ రాజ్ పెట్టిన మెసేజ్ ఏమిటంటే.. ‘డియర్ విష్ణు, ‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ‘మా’ సమర్ధవంతంగా నడిపించేందుకు అవసరమైన శక్తిని నువ్వు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అయితే ‘మా’ సభ్యత్వానికి నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించు. అయితే ఒక నాన్-మెంబర్ గా నీకు అన్ని విధాలా సాయం చేస్తాను. థ్యాంక్యూ’ అంటూ ప్రకాశ్‌రాజ్’ మెసేజ్ చేశాడు.
అయితే, ఆ మెసేజ్ కి విష్ణు కూడా అంతే మర్యాదగా మెసేజ్ చేశాడు. ‘డియర్ అంకుల్.. మీరు నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దు. మా కుటుంబలో మీరూ భాగమే. కలిసి పనిచేయడానికి మీ ఆలోచనలకు మాకు అవసరం. మీరు ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వొద్దు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. లవ్ యు అంకుల్. దయచేసి తొందరపడొద్దు’’ అని పీసోత్ చేశాడు.
మరి విష్ణు అభ్యర్ధనను ప్రకాష్ రాజ్ ఎంతవరకు అంగీకరిస్తాడు అనేది చూడాలి. మొత్తానికి నిన్నటి వరకు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుని అడ్డమైన తిట్లు తిట్టుకుని, నేడు డియర్ విష్ణు, డియర్ అంకుల్ అంటూ విష్ణు – ప్రకాష్ రాజ్ నెటిజన్లకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఇక ఆటలో అరటి పండులా మధ్యలో వచ్చిన నాగబాబు ఒంటరి అయిపోయాడు.
For the future. We are one. Always. pic.twitter.com/1Frpl8VVpt
— Vishnu Manchu (@iVishnuManchu) October 11, 2021