https://oktelugu.com/

Manchu Vishnu: శివ శంకర్ మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను : మంచు విష్ణు

Manchu Vishnu: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ కి కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన లుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 75 శాతం పైగా ఊపిరితిత్తులు పాడయ్యాయని… ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. మాస్టర్ మాత్రమే కాక ఆయన కుటుంబంలో ఆయన భార్యకి, పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకింది. పెద్ద కొడుకుకి కూడా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య మాత్రం హోం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 26, 2021 / 03:28 PM IST
    Follow us on

    Manchu Vishnu: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ కి కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన లుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 75 శాతం పైగా ఊపిరితిత్తులు పాడయ్యాయని… ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. మాస్టర్ మాత్రమే కాక ఆయన కుటుంబంలో ఆయన భార్యకి, పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకింది. పెద్ద కొడుకుకి కూడా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య మాత్రం హోం క్వారంటైన్ లో ఉన్నారు.

    శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు అజయ్ అందరి బాగోగులు చూసుకుంటున్నాడు, శివశంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమౌతోందని, రోజుకు లక్ష రూపాయల దాకా వైద్య ఖర్చుల అవుతోందని సమాచారం. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శివశంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది శివశంకర్ మాస్టర్ కి సహాయం చేయడానికి ముందుకొచ్చారు.  సోనుసూద్, హీరో ధనుష్ శివ శంకర్ మాస్టర్ వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మంచు విష్ణు ఆరా తీశారు.

    ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో మాట్లాదినట్లు తెలిపారు. శివశంకర్ మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని కోరారు. శివశంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలానే శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటామని మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఆయన త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించారు.