https://oktelugu.com/

Vishnu Manchu: ఆ నీచురాలు వల్లే నా తమ్ముడితో గొడవలు అయ్యాయి అంటూ మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్!

మంచు విష్ణు తన ప్రాజెక్ట్ 'కన్నప్ప' తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్ వంటి సూపర్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 10, 2024 / 12:25 PM IST

    Vishnu Manchu

    Follow us on

    Vishnu Manchu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబుది ఒక ప్రత్యేకమైన స్థానం. విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరో గా, నిర్మాతగా ఇలా ఆయన పోషించని పాత్ర అంటూ ఏది మిగలలేదు. అలా ఇండస్ట్రీ లో లెజెండ్ స్థానాన్ని సంపాదించుకున్న మోహన్ బాబు విద్యానికేతన్ సంస్థ ని స్థాపించి గొప్ప విద్యావేత్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే మోహన్ బాబు లేజసి ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కొడుకులిద్దరూ విఫలం అయ్యారు. మంచు విష్ణు, మంచు మనోజ్ కి చెప్పుకోదగ్గ పలు సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ స్థిరమైన మార్కెట్ లేకపోవడం శోచనీయం. మోహన్ బాబు అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన మార్కెట్ మొత్తం పోయింది. మంచు మనోజ్ కి కాస్త మంచి క్రేజ్ ఉంది కానీ, ఆయన మధ్యలో లాంగ్ గ్యాప్ ఇవ్వడం తో కెరీర్ సర్వనాశనం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు, తేజ సజ్జ హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘మిరాయ్’ లో ఈయన విలన్ గా నటిస్తున్నాడు.

    ఇక మంచు విష్ణు తన ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్ వంటి సూపర్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కనీసం ఈ చిత్రమైనా మంచు విష్ణు కెరీర్ ని మలుపు తిప్పుతుందో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు, మంచు మనోజ్ కి మధ్య విబేధాలు ఉన్నాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఒకరోజు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసిన వీడియో ని మంచు మనోజ్ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన ఘటన ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఇది నిజమైన గొడవనా?, లేదా సరదాగా జరిగిన గొడవనా అనేది చాలామందికి ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ అది నిజమైన గొడవే అని మనోజ్ పలు సందర్భంలో పరోక్షంగా చెప్పాడు.

    అయితే ఎంతో ఆప్యాయతతో ఉండే ఈ అన్నదమ్ములు ఎందుకు కొట్టుకుంటున్నారు, అసలు ఏమి జరిగింది అనేది పరిశీలిస్తే, మంచు మనోజ్ భూమా మౌనిక ని పెళ్లి చేసుకోవడం మంచు విష్ణు కి ఏమాత్రం ఇష్టం లేకపోవడం వల్లే అని తెలుస్తుంది. ఆ రాక్షసి వల్లే మా ఇంట్లో గొడవలు అంటూ ఇటీవల మంచు విష్ణు తన ‘మా’ సభ్యులలో ఒక సీనియర్ ఆర్టిస్టుతో అన్నట్టు సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగుతుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, జరుగుతున్న సంఘటనలు మొత్తం చూస్తుంటే నిజమేనేమో అని అనిపించక తప్పదు. భవిష్యత్తులో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇది ఇలా ఉండగా మంచు విష్ణు కన్నప్ప చిత్రం డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.