పవన్ వ్యాఖ్యలపై మంచు విష్ణు హాట్ కామెంట్స్.. ప్రకాష్ రాజ్ ను ఇరికించాడు..

సినీ ఇండస్ట్రీ సమస్యలను ఎలుగెత్తి చాటిన జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి సొంత సినిమా వాళ్లలోని కొంత మంది నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సినీ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడడం లేదని నిలదీశారు. తాజాగా మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా పవన్ వ్యాఖ్యలకు స్పందించారు. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో తన ప్యానెల్ […]

Written By: NARESH, Updated On : September 28, 2021 2:54 pm
Follow us on

సినీ ఇండస్ట్రీ సమస్యలను ఎలుగెత్తి చాటిన జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి సొంత సినిమా వాళ్లలోని కొంత మంది నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సినీ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడడం లేదని నిలదీశారు. తాజాగా మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా పవన్ వ్యాఖ్యలకు స్పందించారు.

‘మా’ ఎన్నికల నేపథ్యంలో తన ప్యానెల్ తో కలిసి నామినేషన్ వేసిన సందర్భంగా మంచు విష్ణు స్పందించారు.  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని అన్నారు. తాను తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఉన్నానని.. మరో అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ రాజ్.. ‘పవన్ వైపు ఉన్నారా? సినీ ఇండస్ట్రీ వైపు ఉన్నారా’ చెప్పాలని మంచు విష్ణు ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపితే ప్రకాష్ రాజ్ విలన్ అయ్యేలా.. మద్దతు ఇవ్వకపోతే మెగా ఫ్యామిలీ దూరం అయ్యేలా మంచు విష్ణు వేసిన ఈ స్టెప్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి గారు, పవన్ గారు వచ్చి నాకే ఓటు వేస్తారని మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేశారు. నాకు ఆ నమ్మకం ఉందన్నారు. నాన్న గారి గురించి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇస్తారన్నారు. ఇప్పటికే దీనిపై ప్రకటన కూడా విడుదల చేశారన్నారు. 10వ తేదీ ఎన్నికలు అయిపోగానే.. 11వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతారని హింట్ ఇచ్చారు.

పవన్ ఇండస్ట్రీకోసం మాట్లాడాడని.. పవన్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన చేసిందని విష్ణు చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదన్నారు.నిర్మాతలే ఆన్లైన్ టికెటింగ్ కావాలని ప్రభుత్వాన్ని కోరారని వివరించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రెండు కళు అని.. నేనుకూడా పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని మంచు విష్ణు స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ తెలుగు ఇండస్ట్రీ పక్కన ఉన్నారా? లేక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారా ఖచ్చితంగా చెప్పాలని మంచు విష్ణు డిమాండ్ చేశారు.

బండ్ల గణేష్ ఆరోపించినట్టు నన్ను ఎవరూ నైట్ పార్టీలకు పిలవలేదని.. నేను రాత్రి 9 గంటలకే నిద్రపోతానని మంచు విష్ణు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఇక తాయిలాలు ఇచ్చేది అవాస్తవమన్నారు.