Manchu Vishnu: మంచు విష్ణుకి అడపా దడపా కొన్ని హిట్లు వచ్చినా స్టార్ కాలేకపోయాడు. ఇక ఐదారేళ్ల నుంచి మంచు విష్ణు నుంచి ఓ మోస్తరు స్థాయి సినిమా కూడా రాకపోవడం విచిత్రమే. మొత్తానికి తనకు హీరోగా పెద్దగా కలిసి రాలేదు కాబట్టి.. నిర్మాతగా ఫుల్ బిజీ కావాలని మంచు విష్ణు ఫిక్స్ అయ్యాడు. విష్ణు తాజాగా మరో వ్యాపారంలోకి దిగాడు. అవా (అవ) ఎంటర్టైన్మెంట్ పేరుతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని విష్ణు స్టార్ట్ చేశాడు.

ఇక తన నిర్మాణ సంస్థలో ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు, లో బడ్జెట్ సినిమాలు చేస్తాడట. అన్నట్టు.. మంచు విష్ణు కేవలం ఓటీటీ కంటెంట్ కోసమే ఈ కంపెనీ పెట్టినట్టు చెప్పాడు. కొత్త నటీనటులు, టెక్నీషియన్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే మంచు విష్ణు ఈ కంపెనీ స్టార్ట్ చేసాడట. మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ అయ్యాక, కాస్త స్పీడ్ పెంచాడు. పైగా మా ఎలక్షన్స్ లో కొత్త వాళ్లకు అవకాశాలు ఇప్పిస్తా అంటూ మాట ఇచ్చాడు.
Also Read: ఏపీ రోడ్లపై తిరిగితే బాడీ మసాజ్ అయిపోతుంది.. సోము సెటైర్లు మామూలుగా లేవండోయ్..
అందుకే, మంచు విష్ణు ఈ అవా (అవ) ఎంటర్టైన్మెంట్ పేరుతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. మరి విష్ణు ఎంతమంది కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. అలాగే మంచు విష్ణు భవనం గురించి కూడా ప్రమాణం చేశాడు. ‘మా’ సంఘానికి చిరకాలంగా వున్న భవన సమస్యకు తాను పరిష్కారం చూపిస్తాను అంటూ ఎన్నికల్లో మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

పైగా అప్పుడు విష్ణు ‘మా’ సంఘానికి కట్టబోయే భవనం ఖర్చు మొత్తాన్ని తమ కుటుంబమే భరిస్తుందని కూడా చెప్పాడు. అలాగే భవనం నిర్మాణం కోసం స్థలాలు కూడా చూశానని విష్ణు చెప్పుకొచ్చాడు. మరి ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయి ? వాటిల్లో దేన్ని ఫైనల్ చేశారు ? లాంటి విషయాలను మాత్రం విష్ణు ఇంతవరకు చెప్పలేదు. ఏది ఏమైనా ‘మా’ అధ్యక్షుడు పదవి ప్రాథమిక బాధ్యతను కూడా మంచు విష్ణు నిర్వహించినట్లు కనిపించడం లేదు.
మంచు విష్ణు ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కి నెలలు గడిచిపోతున్నాయి. చివరకు సినిమా ఇండస్ట్రీనే కష్టాల్లో మునిగిపోయే పరిస్థితి వచ్చినా మంచు విష్ణు మాత్రం అటు వైపు తొంగి చూడకపోవడం ఆశ్చర్యకరం. మరి ఇప్పుడు ఈ కంపెనీ పెట్టి ఎవర్ని ఉద్ధరిస్తాడో చూడాలి. పైగా ఆల్ రెడీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే పేరుతో మంచు విష్ణుకి ఒక నిర్మాణ సంస్థ కూడా ఉంది. శ్రీను వైట్లతో ఢీ సీక్వెల్ కూడా ఈ బ్యానర్ పైనే చేస్తున్నాడు.
Also Read: తమిళంలోకి అఖండ.. రేపే రిలీజ్.. కలెక్షన్స్ వస్తాయా ?