Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఇండియన్ క్రికెట్ జట్టు తొలిసారి వరల్డ్‌కప్ గెలిచిన నేపథ్యంతో తెరకెక్కిన మూవీ ‘83’. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్, ఆయన భార్యగా దీపిక పదుకొణె నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీ లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18 నుంచి నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొత్తం 5 భాషల్లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే. బాలీవుడ్ నటి, నాగిని సీరియల్ ఫేమ్ మౌనీరాయ్ పెళ్లి చేసుకుంది. దుబాయికి చెందిన వ్యాపార వేత్త సూరజ్ నంబియార్‌తో ఏడడుగులు వేసింది. గోవాలో ఈ మ్యారేజ్ హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. మోనీ మెడలో సూరజ్ మూడు ముళ్లు వేశారు. సూరజ్, మౌనీరాయ్ జంట తెల్లని దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ఈ జోడీకి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్ కోసం పోటీ..!

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు నట్టి కుమార్ ప్రకటించారు. వైసీపీ అధినేత సీఎం జగన్ కోసమే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. అలాగే వైసీపీ తరపున టీడీపీతో పాటు ప్రతిపక్షాలను ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ నిర్మాత నట్టి కుమార్ ప్రకటించారు.

Also Read: తమిళంలోకి అఖండ.. రేపే రిలీజ్.. కలెక్షన్స్ వస్తాయా ?
[…] Also Read: మూవీ టైమ్ : ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్… […]