Manchu Vishnu: మంచు విష్ణుకు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఆయన ఇష్టాన్ని భార్య విరానికా రెడ్డి ఒప్పుకోవడం లేదట. దీంతో చింతిస్తూ సోషల్ మీడియాలో తన ఆవేదన పంచుకున్నాడు.ఇంతకీ మంచు విష్ణు కోరిక ఏమిటంటే… గుబురైన పొడవాటి గడ్డం పెంచడం. కొన్నాళ్లుగా గడ్డం పెంచడం అబ్బాయిల ట్రెండ్ గా మారిపోయింది. పొడవైన గుబురు గడ్డం పెంచడం, దాన్ని రకరకాల షేప్స్ లో కట్ చేయడం ఇష్టపడుతున్నారు. గడ్డానికి సపరేట్ గా క్రీమ్స్, ఆయిల్స్ కూడా వచ్చాయి. గడ్డం సరికొత్త అందాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు.

గతంలో మంచు విష్ణు సైతం గడ్డం పెంచాడు అప్పటి ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మంచు విష్ణు… ఇలానే మరలా గడ్డం పెంచాలని ఉంది. అయితే హోమ్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవడం లేదు, అంటూ కామెంట్ పెట్టాడు. హోమ్ డిపార్ట్మెంట్ అంటే భార్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరానికా రెడ్డికి మంచు విష్ణు గడ్డం పెంచుకోవడం ఇష్టం లేదట. ఇక మంచు విష్ణు పోస్ట్ చూసిన అభిమానులు, ట్రోలర్స్ తమదైన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మంచు విష్ణు ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక ఒక్క హిట్ అంటూ విశ్వ ప్రయత్నం చేస్తున్న విష్ణుకు ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. డబ్బులు దండిగా ఉన్నోళ్లు కావడంతో ప్రేక్షకులు ఆదరించకున్నా సినిమాలు చేయడం ఆపడం లేదు. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి ఏమాత్రం తగ్గని రిజిస్ట్ జిన్నా చవిచూసింది. కామెడీ హారర్ జోనర్లో మంచు విష్ణు చేసిన జిన్నా మూవీ సైతం ఘోర పరాజయం అందుకుంది. ఒకింత పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఫలితం మారలేదు . జిన్నా ఆడుతున్న థియేటర్స్ వైపు ప్రేక్షకులు కన్నెత్తి చూడలేదు.

దీపావళి కానుకగా విడుదలైన నాలుగు చిత్రాల్లో జిన్నా అత్యంత తక్కువ వసూళ్లు అందుకుంది. కనీసం థియేటర్స్ రెంట్ కూడా రాని పరిస్థితి నెలకొంది. మొత్తంగా జిన్నా మూవీ షేర్ రూ. 50 లక్షల లోపే ఉంది. హీరోయిన్ సన్నీ లియోన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ లో సగం కూడా జిన్నా రాబట్టలేకపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మరో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటించారు. వరుస డిజాస్టర్స్ నేపథ్యంలో మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Thinking of growing back this beard. The home department isn’t agreeing pic.twitter.com/pNwiMmQSoD
— Vishnu Manchu (@iVishnuManchu) October 27, 2022