https://oktelugu.com/

మంచు విష్ణు ‘నాయకుడు’ ముస్తాబవుతున్నాడు !

నిర్మాతగా వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ మంచు విష్ణు మాత్రం తన నిర్మాణాన్ని ఆపడం లేదు. తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మరో వెబ్ సిరీస్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ మధ్య భారీ బడ్జెట్ పెట్టి చేసిన ‘మోసగాళ్ళు’ విష్ణును దారుణంగా మోసం చేశారు. పైగా హాలీవుడ్ దర్శకుడ్ని తీసుకువచ్చి తెలుగు సినిమా చేయిస్తే.. ఆ సినిమా కాస్త, షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, సినిమాకి తక్కువలా తయారైంది. చివరకు హీరోగానే కాకుండా నిర్మాతగా […]

Written By:
  • admin
  • , Updated On : June 8, 2021 / 05:24 PM IST
    Follow us on

    నిర్మాతగా వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ మంచు విష్ణు మాత్రం తన నిర్మాణాన్ని ఆపడం లేదు. తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మరో వెబ్ సిరీస్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ మధ్య భారీ బడ్జెట్ పెట్టి చేసిన ‘మోసగాళ్ళు’ విష్ణును దారుణంగా మోసం చేశారు. పైగా హాలీవుడ్ దర్శకుడ్ని తీసుకువచ్చి తెలుగు సినిమా చేయిస్తే.. ఆ సినిమా కాస్త, షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, సినిమాకి తక్కువలా తయారైంది.

    చివరకు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దారుణంగా నష్టపోయాడు విష్ణు. అయినా, నిర్మాతగా మాత్రం ఫుల్ బిజీ అవ్వడానికి ప్రస్తుతం విష్ణు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ‘జీ5’కి ఒక వెబ్ సిరీస్ చేసిన విష్ణు, ఇప్పుడు మూడు వెబ్ సిరీస్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక వెబ్ సిరీస్ ను వచ్చే నెల నుండి మొదలు పెట్టనున్నారు. అన్నట్టు ఈ వెబ్ సిరీస్ పేరు ‘నాయకుడు’.

    ఈ ‘నాయకుడు’ కోసం విష్ణు సుమారు నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అందుకే, ఈ నాయకుడు కోసం ప్యాడింగ్ ఆర్టిస్ట్ లనే ఎంపిక చేస్తున్నాడు. మెయిన్ లీడ్ గా శ్రీకాంత్ నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ నాయకుడు టైటిల్ రోల్ ను ఆర్కే సాగర్ పోషించబోతున్నాడట. ‘షాదీ ముబారక్’ అంటూ లాక్ డౌన్ కి ముందు దిల్ రాజు సపోర్ట్ తో షాదీ సినిమాతో వచ్చాడు సాగర్.

    ఆ సినిమాకి మంచి స్పందన వచ్చింది. అలాగే మరో క్రేజీ యాక్షన్ సినిమాలో కూడా సాగర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావొస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ తగ్గినా తరువాత నుండి బ్యాలెన్స్ షూట్ మొదలుకానుంది. ఆ తరువాత నుండి మంచు విష్ణు బ్యానర్ లో రానున్న ‘నాయకుడు’ షూట్ లో సాగర్ జాయిన్ కానున్నాడు