రాజద్రోహం కేసు తొలగిస్తారా?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎంపీగా గెలిచి ఏడాదిన్నరగా పోరాడుతున్న ఆయనపై తాజాగా సీఐడీ చేసిన రాజద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపింది. తరువాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన రాజద్రోహం సెక్షన్ కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఈ సెక్షన్ ను తొలగించాలని కేంద్రానికి తీర్మానాలు చేసి పంపాలంటూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖ కలకలం ేపుతోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక రూపంలో జరిగే […]

Written By: Srinivas, Updated On : June 8, 2021 5:32 pm
Follow us on

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎంపీగా గెలిచి ఏడాదిన్నరగా పోరాడుతున్న ఆయనపై తాజాగా సీఐడీ చేసిన రాజద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపింది. తరువాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన రాజద్రోహం సెక్షన్ కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఈ సెక్షన్ ను తొలగించాలని కేంద్రానికి తీర్మానాలు చేసి పంపాలంటూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖ కలకలం ేపుతోంది.

అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక రూపంలో జరిగే నేరపూరిత కుట్రపై మాత్రమే రాజద్రోహం సెక్షన్(124ఏ) ప్రయోగించాలంటూ సుప్రీంకోర్టు తాజాగా మరోసారి గుర్తు చేసింది. ప్రభుత్వం అంతకంటే ముందే తమకు వ్యతిరేకంగా నిత్యం విమర్శలకు దిగుతున్న రఘురామరాజుపై ఈ సెక్షన్ కింద అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసు ఎంతవరకు నిలబడుతుందో నిర్దిష్టంగా చెప్పలేకపోయినా ఇప్పుడు అదే సెక్షన్ తొలగించేందుకు రఘురామ మొదలు పెట్టిన పోరు మాత్రం చర్చనీయాంశం అవుతోంది.

రాష్ర్టాలకు సంబంధించిన అంశాల్ని,సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు రాష్ర్ట ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపుతుంటాయి. వీటిని కేంద్రం ఆమోదించే సందర్భాలు తక్కువే. అయినా ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి తీర్మానాలు చేసి పంపుతుంటాయి. ఇప్పుడు రెబల్ ఎంపీ రఘురామ ఏకంగా ఐపీసీలో ఓ సెక్షన్ తొలగించాలంటూ తీర్మానం చేసి పంపాలని సీఎంలను కోరారు.

యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజద్రోహం కింద చాలా మందిపై కేసులు పెట్టారు. తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సైతం రాజద్రోహం కేసుల్ని నమోదు చేశారు. తమకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపైై కేంద్రంలో ఎన్డీఏ సర్కారుతో పాటు బీజేపీ పాలిన ప్రభుత్వాలు కలిసి దాదాపు ఏడు వేలకు పైగా రాజద్రోహంతో పాటు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించాయి. దీంతో బీజేపీ పాలిత ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న రాజద్రోహం సెక్షన్ ను ఐపీసీ నుంచి తొలగించేందుకు సహకరిస్తాయని భావించడం లేదు.