Manchu Vishnu And Srikanth Odela: మోహన్ బాబు హీరోగా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ కి సేవలు అందించాడు.ఆ తర్వాత తన నట వారసులుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ సైతం వరుస సినిమాలు చేసినప్పటికి వాళ్లకి ఆశించిన మేరకు విజయాలైతే దక్కడం లేదు. మరి ఇలాంటి క్రమంలోని ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ప్రస్తుతం మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప (Kannappa) సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మంచు విష్ణు (Vishnu) పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడు. లేకపోతే మాత్రం భారీగా వెనకబడి పోయే అవకాశమైతే ఉంది. మరి ఏది ఏమైనా ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇది ఇలా ఉంటే దసర (Dasara) సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Stikanth Odela) ఇప్పటి వరకు ఆయన చేసింది ఒక్క సినిమానే అయినప్పటికి ఆయనకు మంచి గుర్తింపైతే వచ్చింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.
Also Read: పాలస్తీనా బాటలో పాకిస్తాన్..?
ఇక ప్రస్తుతం నాని(Nani) తో ప్యారడైజ్ (Paradaise అనే సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా మంచు విష్ణు పోడ్ కాస్ట్ లో పాల్గొన్నప్పుడు మీ నాన్నగారి సినిమాల్లో ఏ సినిమాని మీరు రీమేక్ చేస్తారు అని అడిగగా ఆయన అసెంబ్లీ రౌడీ (Asambli Roudy) అనే సినిమా పేరు చెప్పాడు.
ఈ సినిమాని ఇప్పుడున్న దర్శకులు ఎవరైతే బాగా చేయగలరు అని అడగగా మంచు విష్ణు దానికి సమాధానంగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) పేరు చెప్పాడు. ఆయన పేరు ఎందుకు చెప్పాడు వీళ్లిద్దరి మధ్య అసెంబ్లీ రౌడీ సినిమా రీమేక్ చేయాలనే చర్చ ఏమైనా నడుస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల చేయబోతున్న సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచి విజయాలు సాధిస్తాయి. ఆయన స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు. లేకపోతే మాత్రం మరోసారి తన మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…