https://oktelugu.com/

రుణం తీర్చుకోవడమే కర్తవ్యం: మంచు విష్ణు

గత వారం రోజులుగా ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి హడావుడి జరుగుతూనే ఉంది. బరిలో ఉన్నాను అంటూ ప్రకాష్ రాజ్ బయటకు రావడం, నువ్వు ఏమిటి నేను కూడా పోటీ చేస్తా అంటూ మంచు విష్ణు రంగంలోకి దిగాడనే వార్తలు రావడం మొత్తానికి ‘మా’లో మళ్ళీ లొల్లి రగిలింది అనే అభిప్రాయం అందరిలో బలంగా కలిగింది. ఆ అభిప్రాయమే నిజం, నేను కూడా పోటీలో దిగుతున్నా అంటూ మంచు విష్ణు ప్రకటించాడు. మంచు విష్ణు మాటల్లోనే.. ‘మా’ […]

Written By:
  • admin
  • , Updated On : June 27, 2021 / 01:59 PM IST
    Follow us on

    గత వారం రోజులుగా ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి హడావుడి జరుగుతూనే ఉంది. బరిలో ఉన్నాను అంటూ ప్రకాష్ రాజ్ బయటకు రావడం, నువ్వు ఏమిటి నేను కూడా పోటీ చేస్తా అంటూ మంచు విష్ణు రంగంలోకి దిగాడనే వార్తలు రావడం మొత్తానికి ‘మా’లో మళ్ళీ లొల్లి రగిలింది అనే అభిప్రాయం అందరిలో బలంగా కలిగింది. ఆ అభిప్రాయమే నిజం, నేను కూడా పోటీలో దిగుతున్నా అంటూ మంచు విష్ణు ప్రకటించాడు.

    మంచు విష్ణు మాటల్లోనే.. ‘మా’ అధ్యక్ష పదవి కోసం జరగబోయే ఎన్నికల్లో నేను కూడా నామినేషన్ వేస్తున్నానని తెలపడం నాకు ఎంతో గౌరవప్రదంగా ఉంది. ‘మా’ కుటుంబ సభ్యుల బాధలు నాకు బాగా తెలుసు. అయినా మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం’. నాకు నా కుటుంబానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన తెలుగు సినీ పరిశ్రమకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి సేవ చేసి ఆ రుణం తీర్చుకోవడమే నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను.

    నా తండ్రి మోహన్‌బాబు గతంలో ‘మా’ అసోసియేషన్‌ కోసం చేసిన సేవలే నాకు ఆదర్శం. అలాగే గతంలో నాకు ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ వైస్ ప్రెసిడెంట్‌ గా పని చేసిన అనుభవం ఉంది. సినీ పెద్దల అనుభవాలతో పాటు యువరక్తం ఆలోచనలతో ‘మా’ నడవాలనేదే నా ప్రయత్నం. ‘మా’లోని అందరి సహకారంతో నేను విజయం సాధిస్తాననే నమ్మకం నాకు ఉంది’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

    కాగా మా ఎన్నికల్లో మంచు విష్ణుతో పాటు ప్రకాశ్‌ రాజ్‌, జీవిత, హేమ కూడా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. మరి వీరందరూ పోటీలో ఉన్నా.. ఎవరు గెలుస్తారనేది క్లారిటీ లేదు. ప్రకాష్ రాజ్ కి చిరంజీవి సంపూర్ణ మద్దతు ఉందనేది ఓపెన్ సీక్రెట్. అయితే, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి పలువురు స్టార్ హీరోలు మంచు విష్ణుకు మేము సపోర్ట్ చేస్తాం అంటూ మాటిచ్చారని తెలుస్తోంది. మరి చూడాలి ఎవరు గెలుస్తారో.