Manchu Vishnu
Manchu Vishnu : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప తెరకెక్కిస్తున్నాడు. తండ్రి మోహన్ బాబు కీలక రోల్ చేయడంతో పాటు నిర్మాతగా వ్యహరిస్తున్నారు. భక్త కన్నప్పగా ఆయన ఈ చిత్రంలో కనిపించనున్నారు. బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన భక్త కన్నప్ప కల్ట్ క్లాసిక్ గా ఉంది. దశాబ్దాల అనంతరం ఆ కథ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు మంచు విష్ణు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కన్నప్ప ఏ స్థాయి విజయం సాధిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రభాస్ రుద్రుడిగా గెస్ట్ రోల్ చేయడం కన్నప్ప చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.
Also Read : మా కుటుంబం మీద ట్రోలింగ్ జరిగేది అందుకే… మంచు విష్ణు ఓపెన్ కామెంట్స్
మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. కన్నప్ప చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరిగింది. అక్కడి సహజమైన ప్రకృతి అందాల నడుమ షూట్ చేశారు. కన్నప్ప సాంగ్స్, టీజర్స్ లో న్యూజిలాండ్ కొండకోనల సౌందర్యం కట్టిపడేస్తుంది. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న థియేటర్స్ లోకి రానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండగా… మంచు విష్ణు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో కన్నప్ప మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అదే సమయంలో సోషల్ మీడియా ట్రోలింగ్, నెగిటివ్ ప్రచారం పై స్పందించారు. మా ఎన్నికల తర్వాత తమ కుటుంబం పై ట్రోలింగ్ ఎక్కువైంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం ట్రోలింగ్, నెగిటివ్ ప్రచారం చేశారు. ట్రోలింగ్ సమస్య అందరికీ ఉంది. ఒక స్టార్ హీరో కూతురిని ట్రోల్ చేశారు. కోటా శ్రీనివాసరావు చనిపోయారని ప్రచారం చేశారు. అది చూసి ఆయన నాకు ఫోన్ చేసి ఆవేదన చెందారు. మా కుటుంబంపై జరిగే ట్రోలింగ్ ని కట్టడి చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకున్నాము, అని మంచు విష్ణు అన్నారు.
తెలుగు సినిమా ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు గెలిస్తే కూడా విమర్శలు చేశారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం మనం చేసుకున్న అదృష్టం. ఒక్క ఇండియన్ సినిమాకు కూడా ఆస్కార్ రాలేదు. ఇతర దేశాల సినిమాలకు పని చేసిన వారికి ఆస్కార్స్ వచ్చాయి. సత్యజిత్ రే కి మాత్రమే గౌరవ ఆస్కార్ ఇచ్చారు. ఆస్కార్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీం కోట్లు ఖర్చు చేశారు అనడం సరైనది కాదు. నేను 200 కోట్లు ఇస్తాను, ఆస్కార్ తీసుకురాగలరా.. అని మంచు విష్ణు ఫైర్ అయ్యారు.
Also Read : రేవంత్ రెడ్డి తో మోహన్ బాబు, విష్ణు కీలక భేటీ